Sita Ramam Movie Review : టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆగస్టు 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్‌డేట్‌లను ఇస్తున్నారు. ఇప్పటికే పలు మేజర్ సిటీల్లో ప్రమోషన్‌లను జరపుతూ చిత్రబృందం సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వివిధ పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. మృణాళ్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్. స్వప్న సినిమాస్ బ్యానర్ పై, వైజయంతి మూవీస్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం ప్రేక్షకులని అలరించేలా కనిపిస్తుంది…
హను రాఘవపూడి చిత్రాలకు మంచి క్రేజ్ తప్పక ఉంటుంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన చాలా చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. ఈ క్రమంలోనే ‘సీతారామం’ చిత్రానికి దాదాపు రూ.18.70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అంటే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలంటే రూ.19.50 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఈ చిత్రానికి ఉన్నక్రేజ్‌కు హిట్ టాక్ వస్తే వారంలోగానే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించనున్నాడు.. రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించింది…
రీసెంట్‌గా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరగగా, ఆ కార్యక్రమానికి ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ఈవెంట్‌కి హాజరు కావడంతో అందరి దృష్టి మూవీపై పడింది. బింబిసారకు పోటీగా ఈ సినిమా విడుదల అవుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ‘సీతారామం’ చాలా ఒరిజినల్ కథ. రియల్లీ క్లాసిక్ మూవీ. చాలా అరుదైన కథ. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ ఎక్కడా రాలేదు. స్క్రీన్ ప్లే నాకు చాలా నచ్చింది. ఊహాతీతంగా వుంటుంది. ట్రైలర్ లో చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. సీతారామం అద్భుతాన్ని వెండితెరపై చూడాల్సిందే అని అంటున్నాడు.
హీరో దుల్కర్ కు గల్ఫ్ దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. సినిమా హిట్టైతే దాదాపు పది కోట్లు వరకూ వసూలు చేస్తుంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో నిజంగానే బ్యాన్ చేస్తే భారీ లాసే. ఈ క్రమంలో సినిమా రిలీజ్ ఆపేస్తారా లేక ఇబ్బంది కరంగా ఉన్న సీన్స్‌ను తొలగించి అక్కడ రిలీజ్ చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో మతపరమైన కొన్ని సీన్స్ ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ తెలిపిందని వినిపిస్తోంది. అయితే తమ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రీసెన్సార్ చేయించనుందట. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.