7th Pay Commission : గత కొద్ది రోజులుగా డీఏ పెంపు నిర్ణయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఎంత పెంచుతారు, ఎప్పుడు పెంచుతారు అనే దానిపై అస్సలు క్లారిటీ లేకుండా పోయింది. నెలల తరబడి విశ్లేషణలు, ఊహాగానాల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు నిర్ణయం జరిగింది. తాజా పెంపుతో డీఏ 38 శాతానికి చేరుకుంది. డీఎన్‌ఏ అనుబంధ సంస్థ జీ బిజినెస్ తాజా నివేదిక ప్రకారం 4 శాతం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోబడిందని సమాచారం. దీనిపై అఫీషియల్ ప్రకటన రావలసి ఉంది.
కొత్త డీఏ లెక్కల ప్రకారం పెరిగిన చెల్లింపులు వచ్చే నెలలో ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వలన 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన ఉద్యోగుల కరువు భత్యం (డీఏ), పింఛనుదారుల కరువు ఉపశమనం (డీఆర్)ను కూడా పెంచినట్టు తెలుస్తుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేట్లకు అనుగుణంగా డీఏ, డీఆర్‌ను 4 శాతం వరకు పెంచినట్టు తెలుస్తుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫారసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పెంపు నిర్ణయం తీసుకున్నది.
ఉద్యోగులకు డీఏను ప్రభుత్వం ఏడాదికి రెండు విడుతల్లో చెల్లిస్తున్నది. డీఏను 4 శాతం పెంచాలని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. దీనికి గత మార్చిలో క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. అయితే కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఈ నేపథ్యంలో డీఏ పెంపు నిర్ణయాన్ని కేంద్రం తాత్కాలికంగా పక్కనబెట్టింది. డీఏను నిర్ణయించడంలో ఏఐసీపీఐ ఇండెక్స్ అత్యంత కీలకం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచడానికి ముందే.. త్రిపుర కేబినెట్ తన రాష్ట్రానికి చెందిన ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్ చెప్పేసింది. డియర్‌నెస్ అలవెన్స్‌ను 5 శాతం పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు తెలిపింది
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
This website uses cookies.