Mrunal Thakur : రెండు వారాలు వేశ్య గృహంలో.. డిప్రెషన్ లో సీతారామం హీరోయిన్.. అసలు ఏంటా కథ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mrunal Thakur : రెండు వారాలు వేశ్య గృహంలో.. డిప్రెషన్ లో సీతారామం హీరోయిన్.. అసలు ఏంటా కథ..!

 Authored By ramesh | The Telugu News | Updated on :3 October 2022,6:00 pm

Mrunal Thakur : బాలీవుడ్ లో సీరియల్స్ తీసుకుంటూ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ఆ పాపులారిటీతో సిల్వర్ స్క్రీన్ పై ఛాన్సులు అందుకుంది. రీసెంట్ గా తెలుగులో సీతారామం సినిమాతో ఇక్కడ ప్రేక్షకులను అలరించింది మృణాల్ ఠాకూర్. సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రకు ఆమె నూటికి నూరు పాళ్లు న్యాయం చేసిందని చెప్పొచ్చు. సినిమాలో మృణాల్ అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అంతేకాదు సీతారామం తర్వాత మృణాల్ కి తెలుగులో క్రేజీ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే మృణాల్ ఠాకూర్ ఓ రెండు వారాలు వేశ్య గృహంలో ఉండాల్సి వచ్చిందట. అదేంటి మృణాల్ ఏంటి వేశ్య గృహంలో ఎందుకు ఉంది.

అసలు ఆమెకు అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అంటే. ఆమె చేసిన లవ్ ఇండియా సినిమాలో పాత్ర కోసం అలా చేయాల్సి వచ్చిందట. లవ్ ఇండియా లో ఆమె వేశ్య పాత్రలో నటించింది. తండ్రి డబ్బుల కోసం కూతురిని వేశ్య గృహానికి పంపిస్తాడు. అయితే ఆ టైం లో వేశ్య గృహానికి వెళ్లి అక్కడ వారి బాధలను తెలుసుకుందట మృణాల్.అక్కడ ఉన్న రెండు వారాలు వారి బాధ విని డిప్రెషన్ లోకి వెళ్లిందట. ఆ డిప్రెషన్ నుంచి బయట పడటానికి చాలా మెడిసిన్స్ వాడిందట. వేశ్య పాత్ర వేస్తున్నంత మాత్రానా వేశ్య గృహాలకు వెళ్తారా అని కొందరు అంటున్నా.. అక్కడ వారి జీవితాల గురించి తెలుసుకుని ఇంకాస్త బాగా పర్ఫార్మ్ చేయొచ్చని మృణాల్ అలా చేయాల్సి వచ్చిందట.

seetharamam mrunal spent time in house

seetharamam mrunal spent time in house

అయితే మృణాల్ చేసిన ఈ అటెంప్ట్ కి కొందరు మాత్రం శభాష్ అనేస్తున్నారు. అంత కష్టపడ్డది కాబట్టే ఆమెకి ఇంత మంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. సీతారామం సినిమా హిందీలో కూడా డబ్ అయ్యి అక్కడ హిట్ కొట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో మృణాల్ కి ఛాన్స్ ఇచ్చే టాక్ వినిపిస్తుంది. మహేష్, ఎన్.టి.ఆర్ సినిమాల్లో ఆమెని హీరోయిన్ గా తీసుకుంటున్నారట. మరి దీనికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ బయటకు రావాల్సి ఉంది. సీతారామం హ్యూజ్ సక్సెస్ అవడంతో మృణాక్ క్రేజ్ డబుల్ అయ్యింది. తెలుగులోనే కాదు ఆమెకు తమిళంలో కూడా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది