Home » Entertainment » Sita Ramam Movie Success Prabhas Fans Are Very Happy
Entertainment

Sita Ramam Movie : సీతారామం సక్సెస్‌… ప్రభాస్ అభిమానులు ఫుల్‌ హ్యాపీ

Authored By
aruna
The Telugu News | Published on: August 7, 2022, 8:30 am
Advertisement

Sita Ramam Movie : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన సీతారామం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కు మొదటి రోజు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో పాటు పాజిటివ్ ఓపెనింగ్ వచ్చాయి. దాంతో వైజయంతి మూవీస్ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 17 కోట్ల మొత్తానికి అమ్మేశారని తెలుస్తోంది. కానీ ఈ సినిమా వసూళ్లు చూస్తూ ఉంటే రూ. 25 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. దాంతో వైజయంతి మూవీస్ వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో వైజయంతి మూవీస్ తెరకెక్కించిన శక్తి సినిమా అత్యంత దారుణమైన పరాజయాన్ని చవి చూసింది.

Advertisement

ఆ తర్వాత కూడా రెండు మూడు సినిమాలు మూవీస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చి డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు మహానటి నుండి మొదలుకొని వైజయంతి మూవీస్ వారు సక్సెస్ ట్రాక్ లో పడ్డారు. వైజయంతి మూవీస్ లో వచ్చిన సీతారామం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో త్వరలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న వైజయంతి మూవీస్ వారు నిర్వహిస్తున్న ప్రాజెక్టు కే సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న వైజయంతి మూవీస్ సంస్థలో వచ్చిన సీతారామం సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే జోష్‌ తో ప్రభాస్ హీరో గా నటిస్తున్న ప్రాజెక్టు కే సినిమా కూడా రాబోతుందని, ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

Sita Ramam Movie success… Prabhas fans are very happy

Advertisement

మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ అద్భుతమైన కళా ఖండంగా ప్రాజెక్ట్ కే సినిమా ను రూపొందిస్తున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున ప్రాజెక్ట్ కే రూపొందుతోంది. ఇది ఒక జాతీయ స్థాయి సినిమా కాకుండా అంతర్జాతీయ స్థాయి సినిమా గా గుర్తింపు దక్కించుకోవడం ఖాయమనే అభిప్రాయం ఉంటుంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని, టైం ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు సర్ప్రైజింగ్ గా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి