Sitara : విదేశాల‌లో తెగ ర‌చ్చ చేస్తున్న సితార‌.. క్యూట్ కామెంట్స్ పెడుతున్న నెటిజ‌న్స్

Authored By Sam C | The Telugu News | Published on: June 1, 2022, 9:00 pm

Sitara : మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార ఇటీవ‌లి కాలంలో చేస్తున్న సంద‌డి మాములుగా లేదు. ఒక‌వైపు సితార త‌న సోష‌ల్ మీడియా ద్వారా క్యూట్ వీడియోలు షేర్ చేస్తుంది. ఇంకోవైపు న‌మ్ర‌త‌ లేదా మ‌హేష్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఇవి చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇటీవలే వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో మహేష్ మరింత అందంగా కనిపించాడు. మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో ..ఆయన కూతురు,గారాల పట్టి సితార ఘట్టమనేని కూడా అంతే… పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సితార ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.

నిత్యం ఏదో ఓ వార్తల్లో మహేష్ కూతురు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. స్టార్ కిడ్‌లో తన తండ్రిలా అందంగా ఉన్న ఆమె ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ఈ అమ్మ‌డు క్యూట్ వీడియో షేర్ చేసింది. ఫ్యామిలీతో క‌లిసి యూర‌ప్ ట్రిప్‌కి వెళ్లగా, అక్క‌డ అంద‌మైన ప్ర‌దేశాల‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అంతేకాదు త‌న సోద‌రుడితో తెగ సంద‌డి చేస్తుంది. వాటికి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు చేర‌వేస్తూ ఉంటుంది. ప్ర‌స్తుతం బ్యూటీ వీడియో నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. సితారకు సమంత అంటే చాలా ఇష్టం అంట. నటి సమంతతో ప్రతి క్షణం గడపడం చాలా సంతోషంగా ఉందని చెబుతోంది సితార.

sitara cute video viral

sitara cute video viral

Sitara : సితార హంగామా..

బ్రహ్మోత్సవం షూటింగ్ సమయంలో సమయంలో తన తండ్రి మహేష్ బాబుతో కలిసి పనిచేస్తున్నప్పుడు సెట్స్‌లో సమంతతో సరదాగా గడిపానని సితార తెలిపింది. సమంతతో కలిసి ఉండడం నాకు ఇష్టం’ అని సితార చెప్పుకొచ్చింది. మహేష్ బాబు కూతురు సితార ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘సామ్ ఆంటీ నాకు మంచి స్నేహితురాలి లాంటి వారు.. మా నాన్నగారి సినిమాల్లో నటించారు. 5 నుంచి 6 ఏళ్ల క్రితం సెట్స్‌లో సరదాగా గడిపినప్పుడు సమంతతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం చాలా సరదాగా అనిపించింది’ అని సితార చెప్పింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp