Sitara : ప్యారిస్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న సితార‌.. బెడ్‌పై ఎక్కి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sitara : ప్యారిస్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న సితార‌.. బెడ్‌పై ఎక్కి..

Sitara: మ‌హేష్ గారాల ప‌ట్టి సితార చిన్న‌ప్ప‌టి నుండి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూనే ఉంది. ఈ చిన్నారి గ‌త కొద్ది రోజులుగా చేస్తున్న సంద‌డి మాములుగా లేదు. ఇటీవ‌ల మ‌హేష్ న‌టించిన స‌ర్కారు వారి పాట కోసం పెన్నీ అనే ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ చేసింది. ఇది ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.ఇక కూచిపూడి డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని మ‌హేష్ షేర్ చేశాడు. చిన్న వయసులోనే తనకంటూ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడమేకాకుండా, తన డాన్స్ వీడియోలతో ఎంతో మంది […]

 Authored By sandeep | The Telugu News | Updated on :5 May 2022,1:00 pm

Sitara: మ‌హేష్ గారాల ప‌ట్టి సితార చిన్న‌ప్ప‌టి నుండి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూనే ఉంది. ఈ చిన్నారి గ‌త కొద్ది రోజులుగా చేస్తున్న సంద‌డి మాములుగా లేదు. ఇటీవ‌ల మ‌హేష్ న‌టించిన స‌ర్కారు వారి పాట కోసం పెన్నీ అనే ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ చేసింది. ఇది ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.ఇక కూచిపూడి డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని మ‌హేష్ షేర్ చేశాడు. చిన్న వయసులోనే తనకంటూ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడమేకాకుండా, తన డాన్స్ వీడియోలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది మహేష్ ముద్దుబిడ్డ సితార. చిన్నారి తెరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా..

మహేష్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ లోని ‘పెన్నీ’ సాంగ్ మ్యూజిక్ వీడియోలో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది.ఇటీవ‌ల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్ సితార కోసం మహేష్ బాబు ని ఎలా ఒప్పించారు అని అడగగా సితార ఒక రాక్ స్టార్ అని తన బాడీ లోనే మంచి స్వింగ్ ఉందని చెప్పుకొచ్చారు తమన్. “నమ్రత గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను మహేష్ బాబు గారిని కూడా అడిగాను. సితార చేసిన కొన్ని ఇంస్టాగ్రామ్ రీల్స్ మహేష్ బాబు గారికి పంపించి వారిని ఒప్పించాను. తను షూటింగ్ ని కేవలం మూడు గంటల్లో పూర్తి చేసింది” అని చెప్పుకొచ్చారు తమన్.

sitara enjoying at paris

sitara enjoying at paris

Sitara : సితార సంద‌డి..!

క‌ళావ‌తి సాంగ్‌కి కూడా సితార ఓ రీల్ వీడియో చేసిన విష‌యం తెలిసిందే.సితార ప్ర‌స్తుతం ప్యారిస్‌లో ఉంది. త‌న ఫ్యామిలీతో క‌లిసి అక్క‌డికి వెళ్ల‌గా అక్క‌డ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇక పారిస్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోస్ ను అటు నమ్రత, ఇటు సితార ఇద్దరూ తమ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అప్ డేట్ చేసేస్తున్నారు. అయితే వీరి పారిస్ పిక్స్ లో ఎక్కువగా మహేష్ బాబు మాత్రం కనిపించడం లేదు. సితార మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఈ చిన్నారి బ్లాక్ డ్రెస్‌లో ప‌రుగెత్తుకుంటూ వెళ్లి మంచంపై జంప్ చేస్తూ స‌ర‌ద‌గా మురిసిపోయింది. సితార‌కు సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది