Star Maa : మళ్లీ కొత్త ప్రయోగం.. బుల్లితెర జంటలతో రొమాంటిక్ గేమ్స్
Star Maa : ఇప్పుడు బుల్లితెరపై షోలు క్లిక్ అవ్వాలంటే ఏదైనా కొత్తగా ఆలోచించాల్సిందే. అందులో రొమాంటిక్ ట్రాక్‌లను జొప్పిస్తే చాలు ఈవెంట్ హిట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ మాలో ప్రతీ ఆదివారం ఏదో ఒకటి కొత్త ఈవెంట్‌ను తీసుకొస్తున్నారు. ఫిబ్రవరి మొదటి రెండు వారాలు బిగ్ బాస్ షో కంటెస్టెంట్లతో రచ్చ చేశారు. బిగ్ బాస్ ఉత్సవం పేరిట వచ్చిన రెండు ప్రోగ్రాంలు బాగానే హిట్ అయ్యాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ల రీయూనియన్ అంటూ అందరూ కలిసి రచ్చ చేశారు.
తాజాగా ఇప్పుడు మరో కొత్త ప్రోగ్రాంను తీసుకొచ్చారు. వచ్చే ఆదివారం ఈ ప్రోగ్రాం ప్రారంభం కాబోతోంది. రియల్ జంటలు, రీల్ జంటలకు మధ్యపోటీ పెట్టి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు స్టార్ మా రెడీ అయింది. అయితే ఇందులో బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన రీల్ జంటలు.. బుల్లితెర సెలెబ్రిటీల్లో రియల్ జంటలను తీసుకొచ్చారు. వారికి వీరికి పోటీ పెట్టి రొమాంటిక్ఆటలు ఆడించారు. ఇందులో రియల్ జంటల్లోంచి మంచి సెలెబ్రిటీలనే పట్టుకొచ్చారు.

six reel and real couples SHow in Star maa
Star Maa : బుల్లితెర జంటలతో రొమాంటిక్ గేమ్స్
సునీత రామ్, నిరుపమ్ మంజుల, అమ్మ రాజశేఖర్ అతని భార్య ఇలా పెద్ద సెలెబ్రిటీలను పట్టుకొచ్చారు. ఇక రీల్ జంటల్లోంచి దీప్తి సునయన, అరియానా అవినాష్, గోరింటాకు, మనసిచ్చి చూడు సీరియల్స్‌లోని హీరో హీరోయిన్లను పట్టుకొచ్చారు. ఇక వీరిలో ఎవరు గెలుస్తారు. ఎవరు బాగా ఆటలు ఆడతారో చూడాలి. రియల్ జంటలు మాత్రం ప్రేమలో నిజంగానే మునిగినట్టున్నారు. నిరుపమ్ తన భార్యపై చెప్పిన కవిత్వం బాగానే వైరల్ అవుతుంది. నా పేరు నిరుపమ్.. నా మనసులో నీ రూపమ్ అంటే చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
6 Real couples and 6 Reel couples on one stage for a beautiful Sunday evening!!! ❤️
‘100%Love’ Feb 21st at 6 PM on @StarMaa #SundayFunday #100PercentLove pic.twitter.com/2uooWEVUuj
— starmaa (@StarMaa) February 15, 2021