Naga Chaitanya : ఎట్టకేలకు నాగ చైతన్యతో డేటింగ్ విషయంపై స్పందించిన శోభిత
Naga Chaitanya : సెలబ్రిటీల ప్రొఫెషనల్ విషయాలే కాదు, వారి వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. వారి ప్రేమ, పెళ్లి, డేటింగ్ విషయాలలో మరింత దృష్టి పెడుతుంటారు. గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగ చైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. చైతు, శోభిత ఎఫ్ఫైర్ రూమర్స్ గురించి సమంత పీఆర్ టీం ని బ్లేమ్ చేస్తూ అక్కినేని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
వారే ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఈ రూమర్లకు మేజర్ హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చిందంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. శోభిత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో మిడిల్ ఫింగర్ చూపిస్తున్న వీడియో పోస్ట్ చేసింది. ఎలాంటి విషయం చెప్పకుండా ఈ వీడియో పోస్ట్ చేసింది శోభిత. అయితే కారణం లేకుండా ఎవ్వరూ మిడిల్ ఫింగర్ చూపించరు. ప్రస్తుతం వస్తున్న రూమర్స్ కి శోభిత రియాక్షన్ ఇదే అంటూ నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఇకనైనా చైతు, శోభిత పై రూమర్స్ ఆగుతాయోమో చూడాలి. శోభిత హీరోయిన్ అయ్యాక ఎలాంటి వివాదంలో చిక్కుకోలేదు అనే చెప్పాలి.
Naga Chaitanya : పుకార్లకి బ్రేక్..
రీసెంట్ గా శోభిత మేజర్ మూవీలో కీలక పాత్రలో నటించింది. ఇక శోభిత ధూళిపాళ ఇటీవలే మేజర్ చిత్రంతో అలరించింది. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. అటు నాగచైతన్య నటించిన ‘థ్యాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలు, ‘దూత’ వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కానున్నాయి.