Anchor Soumya Rao : జబర్దస్త్‌ యాంకర్ గా సౌమ్యరావు కావాలా? వద్దా? అంటూ పోల్‌ పెడితే ఏం జరిగిందో తెలుసా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 13, 2022, 2:00 pm

Anchor Soumya Rao : సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ఇన్నాళ్లు అనసూయ మరియు రష్మి గౌతమ్ మాత్రమే యాంకర్స్ గా వ్యవహరించారు. ఈ మధ్య కాలం లో అనసూయ సినిమా లతో బిజీగా ఉండడం వల్ల డేట్లు కుదరడం లేదు అంటూ జబర్దస్త్ కి గుడ్ బాయ్ చెప్పేసింది. దాంతో రష్మి గౌతమ్ మొత్తం తానై జబర్దస్త్ ని ముందుకు నడిపించింది. మళ్లీ అనసూయ స్థానంలో కన్నడ బ్యూటీ సౌమ్య రావు ని మల్లెమాల వారు తీసుకొచ్చారు. ఆమె ప్రేక్షకులను అలరిస్తుంది అని ముందు నుండి జబర్దస్త్ టీం నమ్మకంతో ఉన్నారు.

ఆమె తెలుగు విషయంలో కొందరు విమర్శలు చేసినా మరి కొందరు మాత్రం పాజిటివ్ గా ఉన్నారు. అనసూయ మరియు రష్మీ కూడా తెలుగు సరిగా మాట్లాడలేరు. అయినా కూడా వారు ఇన్నాళ్లు జబర్దస్త్ కార్యక్రమాన్ని యాంకర్ గా ముందుకు నడిపారు. కనుక సౌమ్య కచ్చితంగా జబర్దస్త్ యొక్క సక్సెస్ లో ముఖ్య పాత్ర పోషిస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలోనే ఒక సోషల్ మీడియా పేజీలో జబర్దస్త్ యాంకర్ గారి సౌమ్య రావు ని కొనసాగించాలా? వద్దా? అంటూ పోలింగ్ నిర్వహించగా ఎక్కువ శాతం మంది అనసూయ మళ్లీ రావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

social media poll on jabardasth Anchor Soumya Rao

social media poll on jabardasth Anchor Soumya Rao

సౌమ్య రావు బాగానే చేస్తుంది అంటూ కొందరు పోలింగ్ లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతి తక్కువ మంది మాత్రం సౌమ్య రావు వద్దు అన్నట్లుగా కామెంట్ చేశారు. మొత్తానికి సౌమ్య రావు కు మంచి స్పందన వచ్చింది. కానీ ఆమె కంటే అనసూయ జబర్దస్త్ లో ఉంటేనే బాగుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అనసూయ లేని పక్షంలో సౌమ్య కంటిన్యూ అవ్వాలి అనేది ఎక్కువ శాతం మంది అభిప్రాయం. మల్లెమాల వారు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp