NTR : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ పాన్ ఇండియన్ సినిమా సాలీడ్ అప్‌డేట్స్ వచ్చేశాయి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NTR : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ పాన్ ఇండియన్ సినిమా సాలీడ్ అప్‌డేట్స్ వచ్చేశాయి..!

 Authored By govind | The Telugu News | Updated on :15 February 2021,11:30 am

JR NTR : ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెండవ సినిమాకి రంగం సిద్దం అవుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అరవింద సమేత వీరరాఘవ వచ్చి మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రూపొందబోతుండగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా భారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

solid update for ntr trivikram pan india movie

solid-update-for-ntr-trivikram-pan-india-movie

ఇక ఈ సినిమా షూటింగ్ కి డేట్ ఫిక్స్ చేసినట్టు లేటెస్ట్ అప్‌డేట్. అంతేకాదు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చే ఈ క్రేజీ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేసేందుకు కూడా త్రివిక్రమ్ డేట్ ని ఫిక్స్ చేసినట్టు తాజా సమాచారం. ఏప్రిల్ 2 నుండి ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల పాన్ ఇండియన్ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు మేకర్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమా నుంచి టీజర్ ను ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20 కి రిలీజ్ చేస్తారట. ఇందుకు సంబంధించిన పక్కా ప్లాన్ తో దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నట్టు తెలుస్తోంది.

NTR : ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ డెబ్యూ సినిమా అన్న మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా ఇద్దరు హీరోయిన్స్ నటించాల్సి ఉందట. వారిలో ఒక హీరోయిన్ పూజా హెగ్డే ని మరొక హీరోయిన్ అతిలోక సుందరి .. అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించే అవకాశాలున్నాయని సమాచారం. అంతేకాదు జాన్వీ కపూర్ డెబ్యూ సినిమా ఎన్టీఆర్ తో అన్న మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీం గా నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నతిస్తున్నాడు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది