సోనూసూద్ నిజమైన సూపర్ హీరో కేటీఆర్ ‘ట్వీట్’కు సోనూసూద్ ఏమన్నారంటే..?
Sonu sood : సోనూ సూద్ Sonu sood గత ఏడాది ముందు వరకు దేశ వ్యాప్తంగా ఒక నటుడుగానే అందరికీ తెలుసు. కానీ గత ఏడాది నుంచి సామాన్యుల పాలిట దేవుడయ్యాడు. కరోనా మహమ్మారితో గత ఏడాది ఎందరో సామాన్య ప్రజలు తిండి లేక..అలమటించిపోయారు. పనిచేస్తున్న కంపెనీలు సంస్థలు మూత పడటంతో ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ఉపాది కరువై బతకడమే ప్రశ్నార్థకంగా మారింది. ఇక లాక్ డౌన్ తో ఎక్కడి వాళ్ళు అక్కడే స్థంబించిపోయారు. అలాంటి వారందరినీ సొంత ఊళ్ళు చేర్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు.
ఉపాది కల్పించాడు. తను సంపాదించినదంతా ఖర్చు చేశాడు. తనకి అభిమానులు ఇతర వ్యాపార వేత్తలు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సోనూసూద్ చేస్తున్న సేవలకు తోడయ్యారు. ఎక్కడ ఎవరు చిన్న సమస్యలో ఉన్న నేనున్నానంటూ బయలుదేరాడు. దాంతో ప్రభుత్వాలు సైతం సోనూసూద్ ని అభినందించాయి. తాజాగా ఒక సంఘటన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ – సోనూసూద్ ల మధ్య జరిగింది. ఒకరికొకరు మీరు హీరో అంటే మీరు హీరో అని ట్విట్టర్ వేదికగా సంభాషణ సాగించారు.
Sonu sood : నిజమైన సూపర్ హీరో కేటీఆర్..
అసలు విషయం ఏమిటంటే నంద కిశోర్ తోకల అనే ఓ నెటిజన్ కేటీఆర్ కి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. “తాను సంప్రదించిన 10 గంటలలోపే తమకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చారని ఆ మేలు ఎప్పటికీ మరిచిపోలేమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో తెలంగాణ ప్రజల కోసం మీ సహకారం కొనసాగించడం అభినందించే విషయమని తెలిపి.. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే .. నిజమైన సూపర్ హీరో కేటీఆర్” అని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పై వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించి.. “నేను ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడిగా నాకు చేతనైనంత సహాయం చేస్తున్నాను.
Sonu sood : కేటిఆర్ ట్వీట్ పై స్పందించిన సోనూసూద్
సూపర్ హీరో నేను కాదు. ‘సోనూసూద్’ను పిలవచ్చు అని కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. దాంతో కేటిఆర్ ట్వీట్ పై స్పందించిన సోనూసూద్.. “మీ మంచి హృదయానికి థాంక్స్. రియల్ హీరో నేను కాదు మీరే.. తెలంగాణ ప్రజల కోసం ఎంతో చేస్తున్నారు. మీ నాయకత్వంలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. తెలంగాణను నా రెండో ఇల్లుగా నేను భావిస్తాను. అందుకు కారణం ఒకటే.. గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు నాపై వెలకట్టలేని ప్రేమ, అభిమానం చూపిస్తున్నారు” అంటూ సోనూసూద్ ట్వీట్ చేశాడు. ఇది చూసి వెంటనే కేటీఆర్ స్పందిస్తూ.. సోనూసూద్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీరు చేస్తున్న గొప్ప పని లక్షలాది మందికి ఆదర్శమని కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.