Sr NTR : స్టార్ కమెడీయన్‌తో సీనియర్ ఎన్టీఆర్‌కి గొడవ జరిగిందా.. ఆ ఇద్దరి మధ్య గ్యాప్ ఏంటి?
Sr NTR : విలక్షణమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులని గెలుచుకున్నారు సీనియర్ ఎన్టీఆర్.వెండితెరపైన దేవుళ్ల పాత్రలను పోషించిన ఎన్టీఆర్ కు తెలుగు నాట ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఎన్నో సేవలు చేశారు.
Sr NTR : ఎక్కడ చెడింది?
ఎన్టీఆర్ ఇటు ఇండస్ట్రీలో అటు రాజకీయాలలో ఎవరితో పెద్దగా గొడవలు పెట్టుకోరు. అందరితో కలుపుగోలుగా ఉండే ఎన్టీఆర్‌తో కమెడీయన్ పద్మనాభంకి చెడింది. నిజానికి అన్నగారి రూంలో పద్మనాభం ఉండేవారట. తర్వాత..అన్నగారు కొన్నాళ్లకు సొంత ఇల్లు కొనుక్కుని చెన్నై టీనగర్‌కు మారిపోయారు. దీంతో ఆ రూంలో పద్మనాభం, రాజబాబు.. వంటివారు ఉండేవారు. అయితే.. అన్నగారితో కలిసి మెలిసిన తిరిగినా.. అన్నగారి కంటే.. కూడా ఆర్థికంగా.. బలమైన పంథాలో ముందుకు సాగారు పద్మనాభం. ఈ క్రమంలోనే అత్యంత త్వరగా.. ఆయన సినీ రంగంలో నిలదొక్కుకున్నారు. సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అదేవిధంగా కొంత వాటా సొమ్ముతో ఒక స్టూడియోను కూడా నిర్మించారు. ఇదిలావుంటే.. తన సినిమాల్లో తొలి చిత్రాన్ని.. ఎన్టీఆర్‌తో చేయించాలని..
ఆయనను హీరోగా చూడాలని పద్మనాభం అనుకున్నారు. కానీ, ఇది కుదరలేదు. దీంతో అన్నగారితో కాకుండా.. తనే స్వయంగా మర్యాద రామన్న చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక రాను రాను ఎన్టీఆర్, పద్మనాభంకి మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పుకొచ్చారు. పద్మనాభం తొలి చిత్రంలో అన్నగారికి కుదరక నటించకపోయినా.. ఈ విషయాన్ని ఎందుకో.. పద్మనాభం దాచారు. “అన్నగారు నటించనన్నారు“ అనే ప్రచారం తెరమీదికి తెచ్చారు. దీంతో అప్పటి నుంచి అన్నగారికి ఆయనకు మధ్య పెద్దగా మాటలు కూడా లేవని అంటారు .సీనియర్ ఎన్టీఆర్‌కి కమెడీయన్స్‌తోనే కాదు పలువురు స్టార్స్‌తోను కొన్ని సందర్భాలలో విబేధాలు వచ్చినట్టు అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. ఈ విషయాలు ఇప్పటికీ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటాయి.