Murali Mohan : శ్రీదేవి ని మురళీ మోహన్ కి ఇచ్చి పెళ్లి చేద్దాము అని పెద్ద ప్లాన్ వేసింది ఎవరు ?

Authored By aruna | The Telugu News | Published on: June 25, 2023, 10:00 am

Murali Mohan : భారతీయ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎన్నటికీ చెరగనిముద్ర వేసుకుంది అతిలోకసుందరి శ్రీదేవి. హీరోయిన్ గా రెండు దశాబ్దాల హీరోలతో నటించి మెప్పించిన ఈ బ్యూటీ తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక శ్రీదేవి అందానికి ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. ఇక శ్రీదేవి తర్వాత బోనీ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే శ్రీదేవి తల్లి మాత్రం ఇంటికి అల్లుడుగా మరో వ్యక్తి వస్తే బాగుండేదని తన మనసులో అనుకునేవారట. ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీమోహన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ శ్రీదేవి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి మురళీమోహన్ కి ఇచ్చి చేస్తే బాగుంటుందని శ్రీదేవి అమ్మగారు అనుకునేవారట. మురళీమోహన్ గుణగణాలు, నెమ్మది తనం మెచ్చి అల్లుడుగా మురళీమోహన్ అయితే బాగుంటుందని అనుకునేవారట. ఈ విషయం మురళీమోహన్ కి ఓ సందర్భంలో తెలిసిందట. అయితే తర్వాత దానికి ఎలాంటి అప్డేట్ తనకి లేదని, అదే మొదటిసారి అదే చివరిసారి అని తెలిపారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు కూడా మురళీమోహన్ శ్రీరామచంద్రుడు అని పిలిచేవారట.

reedevi mother plan to his daughter marriage with Murali mohan

reedevi mother plan to his daughter marriage with Murali mohan

ఆయన అలా పిలిచినందుకు అయిన బుద్ధిమంతుడిగా ఉండాలని అనుకున్నారట. పొదుపుగా , ఒదుగ్గా ఉండడం ఆయన చూసి నేర్చుకున్నట్లు తెలిపారు. ఏఎన్ఆర్ గారి ద్వారా శ్రీదేవి అమ్మగారు తనలోని మంచితనం తెలుసుకోవడం తర్వాత తనని చూడడం జరిగిందన్నారు. శ్రీదేవి కనుక మురళీమోహన్ ని పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు సిచ్యువేషన్ వేరేలా ఉండేదేమో అని అనుకుంటున్నారు. అప్పట్లో సినిమాలతో బిజీగా ఉన్న మురళీమోహన్ ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు. వ్యాపార బాధ్యతలు కూడా పిల్లలకు అప్పగించినట్లు తెలుస్తుంది.

aruna

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp