Sreeleela : శ్రీలీల జోరు మాములుగా లేదుగా… నితిన్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ అందుకున్న యంగ్ బ్యూటీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreeleela : శ్రీలీల జోరు మాములుగా లేదుగా… నితిన్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ అందుకున్న యంగ్ బ్యూటీ..!

Sreeleela : ఈ మ‌ధ్య టాలీవుడ్‌లో కుర్ర భామ‌ల హంగామా ఎక్కువ‌గా ఉంది.కృతి శెట్టి, శ్రీ లీల వంటి వారు వ‌రుస ఆఫ‌ర్స్ తో దూసుకుపోతున్నారు. పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన చిన్నది శ్రీలీల. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కన్నడలో పలు సినిమాల్లో నటించిన శ్రీలీలమొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. స్టార్ హీరోల సరసన మంచి పాత్రలు దక్కుతున్నాయి. రెండవ సినిమానే రవితేజ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :19 March 2022,8:20 am

Sreeleela : ఈ మ‌ధ్య టాలీవుడ్‌లో కుర్ర భామ‌ల హంగామా ఎక్కువ‌గా ఉంది.కృతి శెట్టి, శ్రీ లీల వంటి వారు వ‌రుస ఆఫ‌ర్స్ తో దూసుకుపోతున్నారు. పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన చిన్నది శ్రీలీల. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కన్నడలో పలు సినిమాల్లో నటించిన శ్రీలీలమొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. స్టార్ హీరోల సరసన మంచి పాత్రలు దక్కుతున్నాయి. రెండవ సినిమానే రవితేజ సరసన చేస్తున్న ఈ భామ, ఆ తరువాత వైష్ణవ్ తేజ్.. నవీన్ పోలిశెట్టి సినిమాలను కూడా లైన్లో పెట్టేసింది.

వైష్ణవ్ తేజ్.. నవీన్ పోలిశెట్టి లాంటి క్రేజీ హీరోల సినిమాలకు కమిటైంది ఈ బ్యూటీ. నందమూరి బాలకృష్ణ- అనీల్ రావిపూడి మూవీ కోసం శ్రీలీలను సంప్రదించారట. నటసింహాకు కూతురి పాత్ర అని టాక్ . ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది. పూజ చెల్లెలిగా శ్రీలీల కనిపించనుందని తెలుస్తుంది . ఈ అమ్ముడు రెమ్యున‌రేష‌న్ రూ. 70ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తుంది.

sreeleela gets crazy offers

sreeleela gets crazy offers

Sreeleela : జోరు మాములుగా లేదు..

నితిన్ సినిమాలోను ఈ అమ్మ‌డు క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని టాక్. యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం మాచెర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే నితిన్ చేయ‌బోయే కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీతో నితిన్ నెక్ట్స్ ప్రాజెక్టు ఉండ‌బోతుంద‌ని టాక్ న‌డుస్తోంది. కాగా ఈ చిత్రంలో బెంగ‌ళూరు బ్యూటీ, పెళ్లిసంద‌D ఫేం శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టించ‌నుంద‌ట‌. ఈ చిత్రానికి జూనియ‌ర్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని ఇన్ సైడ్ టాక్‌. నితిన్ హోం బ్యాన‌ర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై నిర్మించ‌బోతున్న ఈ చిత్రం ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని ఇన్‌సైడ్ టాక్‌.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది