Sreeleela : ఆ స్టార్ హీరోతో శ్రీలీల డేటింగ్ నిజమేనా..?
ప్రధానాంశాలు:
Sreeleela : ఈ స్టార్ హీరోతో శ్రీలీల డేటింగ్ నిజమేనా..?
Sreeleela : టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన నటి శ్రీలీల కెరీర్ ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది. “పెళ్లి సందD” సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ధమాకా, మరియు భగవంత్ కేసరి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దర్శక, నిర్మాతలు ఆమె పేరు వినిపిస్తేనే సినిమాలు హిట్ అవుతాయనే స్థాయికి చేరుకుంది. అయితే ఇటీవల ఆమె నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఫలితంగా శ్రీలీల క్రేజ్ కొంతమేర తగ్గిపోయిందనే ప్రచారం వినిపిస్తోంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లకు బ్రేక్ పడినా, కోలీవుడ్, బాలీవుడ్ వైపు ఆమె దృష్టి మళ్లింది.

Sreeleela : ఆ స్టార్ హీరోతో శ్రీలీల డేటింగ్ నిజమేనా..?
Sreeleela శ్రీలీల డేటింగ్ వార్తల్లో నిజముందా..?
తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ తమిళ, హిందీ పరిశ్రమల్లో శ్రీలీల హవా కొనసాగుతోంది. ప్రముఖ తమిళ నటుడు అజిత్ నటిస్తున్న “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. అంతే కాకుండా శివ కార్తికేయన్ సినిమాలోనూ ఆమె ఛాన్స్ దక్కించుకుంది. ఇక బాలీవుడ్‌లో కూడా శ్రీలీల ఎంట్రీకి సిద్ధమవుతోంది. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహిం ఖాన్ నటిస్తున్న “దిలర్” చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్‌తో మరో సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు విజయవంతం అయితే శ్రీలీల బాలీవుడ్‌లో తన స్థానాన్ని పక్కా చేసుకునే అవకాశముంది.
శ్రీలీల వ్యక్తిగత జీవితం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఓ ఇంటర్వ్యూలో ప్రేమలో ఉన్నట్లు చెప్పిన శ్రీలీల ఇప్పుడు కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్‌లో ఉందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌లో శ్రీలీల పాల్గొనడం, ముంబైలో ఎక్కువగా కనిపించడం ఈ ప్రచారాలకు మరింత బలం చేకూర్చింది. మరోవైపు కార్తీక్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఈ రూమర్లను మరింత బలపరిచాయి. ఆమె తన కొడుకు జీవిత భాగస్వామిగా ఓ మంచి డాక్టర్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. శ్రీలీల ప్రస్తుతానికి వైద్య విద్యను అభ్యసిస్తుండటంతో, ఈ వ్యాఖ్యలు ఆమెను ఉద్దేశించే చేసినవని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే, ఈ వార్తలపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి