Sreeleela : టోలర్స్ కి మాస్ వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల.. పిచ్చి పిచ్చి రాతలు రాస్తే చెప్పుతో కొడతా అంటూ కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreeleela : టోలర్స్ కి మాస్ వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల.. పిచ్చి పిచ్చి రాతలు రాస్తే చెప్పుతో కొడతా అంటూ కామెంట్స్..!

Sreeleela :ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా శ్రీలీల ఉన్నారు. ‘ ధమాకా ‘ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ బ్యూటీ ప్రస్తుతం చేతిలో అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క డాక్టర్ కోర్స్ పూర్తి చేస్తున్నారు. సినిమాల్లో తన డాన్స్, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీలకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. […]

 Authored By anusha | The Telugu News | Updated on :5 December 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Sreeleela : టోలర్స్ కి మాస్ వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల..

  •  పిచ్చి పిచ్చి రాతలు రాస్తే చెప్పుతో కొడతా అంటూ కామెంట్స్..!

Sreeleela :ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా శ్రీలీల ఉన్నారు. ‘ ధమాకా ‘ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ బ్యూటీ ప్రస్తుతం చేతిలో అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క డాక్టర్ కోర్స్ పూర్తి చేస్తున్నారు. సినిమాల్లో తన డాన్స్, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీలకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. టాలీవుడ్ లో ఎక్కడ విన్నా ఏ ఈవెంట్ లో చూసిన శ్రీలీల పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్ హీరోగా చేస్తున్న ‘ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ‘ సినిమాలో హీరోయిన్గా నటించారు. ఈ సినిమాతో టాలీవుడ్ రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో రాజశేఖర్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాను సుధాకర్ రెడ్డిమ నికిత రెడ్డి నిర్మించారు.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 8న గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ విడుదలయ్యాయి. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. తాజాగా డిసెంబర్ 4న హైదరాబాదులో ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ లీల మాట్లాడుతూ ఎక్స్ట్రార్డినరీ ఆడియన్స్ కోసం ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా తీశాం. మీరంతా ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇక నితిన్ గారు చాలా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఆయనతో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్రని చాలా మాస్ గా చూపించారు. ఈ పాత్ర మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇక నితిన్ మాట్లాడుతూ శ్రీ లీలకు ఉన్న మరిన్ని టాలెంట్ గురించి చెబుతూ నేను ఇప్పటికే చాలా సినిమాలు చేశాను. ఇలాంటి హీరోయిన్ ని చూడలేదు. శ్రీ లీల బాగా నటించారు. మొదటిరోజు షూటింగ్ కి వచ్చినప్పుడు తన గురించి అడిగి తెలుసుకున్నాను. ఇక శ్రీ లీల యాక్టింగ్, డాన్స్ , డాక్టర్ మాత్రమే కాదు స్విమ్మింగ్ లో స్టేట్ లెవెల్లో ఆడారు. హాకీ స్టేట్ లెవెల్లో ఆడారు. తనకి కూచిపూడి, భరతనాట్యం కూడా వచ్చు. ఇంకా చాలా చెప్పింది. నేను ఆరోజు చాలు ఇంకా అనకపోతే ఇంకా తన టాలెంట్స్ బయట పెడుతూ ఉండేది. ఇంత చిన్న పిల్లలో అన్ని టాలెంట్స్ చూసి ఆశ్చర్యపోయాను. నిజంగా తాను గ్రేట్ అంటూ నితిన్ శ్రీలీలను పొగడ్తలతో ముంచేశారు. ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది