SreeLeela : వ‌రుస ఆఫ‌ర్ల‌తో కేక‌పుట్టిస్తున్న‌ శ్రీలీల… స్టార్ హీరోయిన్ రేసులో.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SreeLeela : వ‌రుస ఆఫ‌ర్ల‌తో కేక‌పుట్టిస్తున్న‌ శ్రీలీల… స్టార్ హీరోయిన్ రేసులో..

 Authored By mallesh | The Telugu News | Updated on :13 July 2022,2:00 pm

SreeLeela : పెళ్లి సంద‌డి మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అందాల బ్యూటీ శ్రీ‌లీల. ఈ ఒక్క సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ్. ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి ద‌ర్వ‌క‌త్వ‌లో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం పెళ్లి సందడి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఇప్ప‌టికే శ్రీ‌లీల‌ కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. శ్రీ‌లీల అందాల‌కు తెలుగు ప్రేక్ష‌కులే కాదు ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఫిదా అవుతున్నారు. దీంతో వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చిప‌డుతున్నాయి ఈ అమ్మ‌డుకి. వ‌రుస సినిమాల‌తో బిజీగా మారిపోయింది.

త‌న గ్లామ‌ర్ తో క‌ట్టిప‌డేస్తున్న శ్రీ‌లీల వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటోంది. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో ర‌వితేజతో ధ‌మాకా మూవీలో న‌టిస్తోంది, అలాగే నితిన్ వ‌క్కంతం వంశీ సినిమాలో, న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు మూవీలో న‌టిస్తోంది. అలాగే మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ తో జోడీ క‌ట్ట‌బోతోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సంస్థ‌లు ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాయి. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌తేజ్‌కు జోడీగా శ్రీలీల న‌టించ‌నుంది.

SreeLeela Pelli Sandadi Movie scene video on Youtube

SreeLeela Pelli Sandadi Movie scene video on Youtube

అలాగే బాల‌య్య బాబు అనీల్ రావిపూడి కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రంలో బాల‌య్య‌కు కూతురిగా న‌టిస్తోంది. వీటితో పాటు గాలి జ‌నార్థ‌న్ రెడ్డి కుమారుడు కిరీటీ డెబ్యూ మూవీలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే క‌న్న‌డ‌లో కూడా మ‌రిన్ని సినిమాల్లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. శ్రీ‌లీల సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. త‌న ఫొటోస్ షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. గ్లామ‌ర్ షో చేస్తూ మ‌తిపోగొడ‌తోంది. ఇక ప్ర‌స్తుత సినిమాలు విజ‌యాన్ని సాధిస్తే స్టార్ హీరోయిన్ వ‌రుస‌లో చేరుతుంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది