Sreemukhi : బ్రేకప్, రిలేషన్ షిప్‌లపై నోరు విప్పేసింది.. అంత పని చేసిన శ్రీముఖి

Authored By Cinema Desk | The Telugu News | Updated on: August 27, 2021, 7:08 pm

శ్రీముఖి ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో శ్రీముఖి తన ప్రేమ కథ గురించి చెప్పింది. బ్రేకప్ జరిగిందని, ఎంతో డిప్రెషన్‌లోకి వెళ్లాను అని శ్రీమఉఖి తెలిపింది. అది కూడా ఇండస్ట్రీలోని ఓ వ్యక్తితోనే ప్రేమలో పడిపోయాను ఆ తరువాత బ్రేకప్ అయిందని తెలుస్తోంది. అయితే తాజాగా శ్రీముఖి తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది.

Sreemukhi About Her Break up And Boy friend

Sreemukhi About Her Break up And Boy friend

సుమ తన యూట్యూబ్ చానెల్ కోసం శ్రీముఖిని తీసుకొచ్చింది. క్రేజీ కిచెన్ అంటూ శ్రీముఖితో ఎన్నో విషయాలు బయటపెట్టించింది. ఈ క్రమంలోనే తన బ్రేకప్ గురించి శ్రీముఖి చెప్పింది. ఆనంద్ లాంటి సినిమాలు చూసినప్పుడు నాకు కూడా జుట్టు కత్తిరించుకోవాలని అనిపించింది అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది. అలా ఎందుకు నీకేమైనా బ్రేకప్ జరిగిందా? అని సుమ ప్రశ్నించింది.

Sreemukhi About Her Break up And Boy friend

Sreemukhi About Her Break up And Boy friend

ఏ నాకు మాత్రం ఉండవా? బ్రేకప్.. రిలేషన్ షిప్.. ఆ టైంలో డిప్రెషన్‌లోకి వెళ్లా.. అని శ్రీముఖి చెప్పేసింది. మిగతా వివరాలు కూడా లాగేందుకు సుమ ప్రయత్నించింది కానీ శ్రీముఖి చెప్పలేదు. అయితే అతడిని మాత్రం శ్రీముఖి అంత ఈజీగా వదిలేసినట్టు లేదు. తమన్నా సింహాద్రితో చెప్పి మంత్రాలు వేయించి.. వాడు నాశనం అయ్యేందుకు చూస్తున్నాను అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp