Sreemukhi : ఒక్కో జంట రెచ్చిపోయిందిగా.. శ్రీముఖితో అవినాష్ రొమాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : ఒక్కో జంట రెచ్చిపోయిందిగా.. శ్రీముఖితో అవినాష్ రొమాన్స్

 Authored By prabhas | The Telugu News | Updated on :30 July 2022,3:40 pm

Sreemukhi : బుల్లితెరపై అవినాష్ చేసే అతి కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోలోనే అంత వల్గర్‌గా కామెడీ చేసేవాడు. తను చేసేది కామెడీనే అని భ్రమలో ఉంటాడు. ఇక బిగ్ బాస్ ఇంట్లోనూ తానే ఎంటర్టైనర్ అనే భ్రమలో ఉండిపోయాడు. తనకి తానే ఎంటర్టైనర్ అని ట్యాగ్ లైన్ ఇచ్చుకున్నాడు. అలా మొత్తానికి అవినాష్ ఇప్పుడు స్టార్ మా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో కీలక సభ్యుడిగా మారిపోయాడు. ఇక శ్రీముఖి సాయంతోనే అవినాష్ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మల్లెమాలకు పది లక్షలు కట్టి.. బిగ్ బాస్ ఇంట్లోకి అవినాష్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పది లక్షలు ఇచ్చింది ఎవరో కాదు శ్రీముఖినే. అలా ఆమె సాయంతో అవినాష్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాడు.

ఇక శ్రీముఖి కూడా బయటి నుంచి బాగానే సాయం చేసింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇంకా వారి మధ్య స్నేహం బలపడింది. మంచి స్నేహితులుగా వీరు కలిసి ఉంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటూ అందరూ పార్టీలు చేసుకుంటుంటారు. అలా ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకే ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేశారు. ఈ వర్షం సాక్షిగా అంటూ చేసిన ఈ ఈవెంట్‌లో సీరియల్, రియల్ జంటలు వచ్చారు. హనీమూన్ ఫ్రీ ట్రిప్ వస్తుందని ఒక్కొక్కరు రెచ్చిపోయారు. ఎంత రొమాన్స్ పండిస్తారో.. అందులో బెస్ట్ ఎవరు వస్తారో వారికే ఈ ట్రిప్ ఫ్రీ అని శ్రీముఖి చెబుతుంది. అందులో శ్రీముఖికి జోడిగా అవినాష్ వచ్చాడు.

Sreemukhi Avinash Fun In E Varsham Saakshiga Ebent

Sreemukhi Avinash Fun In E Varsham Saakshiga Ebent

ఇక సీరియల్ జంటల రొమాన్స్ ఒక వైపు శ్రీముఖితో అవినాష్ తంటాలు ఇంకో వైపు ఉన్నాయి. మొత్తానికి ఈ ప్రోమోలో సీరియల్ జంటలు మాత్రం నానా హంగామా చేసి పడేశాయి. దేవత, కార్తీకదీపం, గోరింటాకు ఇలా అందరూ వచ్చేశారు. అర్జున్ సుహాసిని, నవ్యస్వామి రవికృష్ణ, నిరుపమ్ మంజుల, మానస్ కీర్తి ఇలా ఒక్కొక్కరు రెచ్చిపోయారు. వాళ్లందరి కంటే కావ్య జోడి దుమ్ములేపేసింది. వాళ్లిద్దరూ చేసిన రొమాంటిక్ ట్రిక్‌ను మనం కూడా చేద్దామన్నట్టుగా శ్రీముఖి ముందు అవినాష్ మోకరిల్లాడు. మొత్తానికి శ్రీముఖి, అవినాష్ కామెడీ ట్రాక్.. జోడిల రొమాంటిక్ ట్రాక్‌తో ప్రోమో అదిరిపోయింది.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది