Sreemukhi : చిరంజీవితో శ్రీముఖి.. గాల్లో తేలిపోతోన్న బుల్లితెర రాములమ్మ

Authored By Sam C | The Telugu News | Published on: March 1, 2022, 5:00 pm

Sreemukhi : ఎంతో మంది అభిమానుల్లో గుండెల్లో చిరంజీవిగా మెగాస్టార్ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న విష‌యం తెలిసిందే.ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఆచార్య విడుదలకు సిద్ధమైంది. దాంతో పాటు గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమాలు ఒకేసారి పూర్తి చేస్తున్నాడు చిరంజీవి. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా భోళా శంకర్ మోషన్ పోస్టర్ విడుదలైంది. అందులో వింటేజ్ మాస్ మెగాస్టార్ కనిపిస్తున్నాడు. చేతిలో త్రిశూలం ఉన్న కీ చైన్ అలా స్టైల్‌గా తిప్పుతూ.. జీపుపై కూర్చున్న మెగాస్టార్‌ను చూసి ఫిదా అయిపోతున్నారు అభిమానులు. చాలా రోజుల త‌ర్వాత చిరంజీవి మాస్ లుక్ చూసి మైమ‌ర‌చిపోతున్నారు.

Sreemukhi  : చిరుపై ప్రేమ కురిపిస్తుందిగా..

సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు సైతం చిరంజీవి మాస్ లుక్‌కి ప‌డిపోతున్నారు. అందాల యాంక‌ర‌మ్మ శ్రీముఖి చిరంజీవి లుక్‌కి ఫిదా కావ‌డ‌మే కాక మోష‌న్ పోస్ట‌ర్‌ని రిపీట్ మోడ్‌లో చూస్తుంద‌ట‌. అంతేకాదు తెర‌పై చిరంజీవి క‌నిపించ‌గా, ఆయ‌న‌ను హ‌త్తుకున్న‌ట్టు ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం శ్రీముఖి స్ట‌న్నింగ్ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ దర్శకుడు. అయితే శ్రీముఖి రోల్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే రీసెంట్‌గా శ్రీముఖి.. ‘ఈ రోజు అమేజింగ్ డే. మొదట చిరంజీవి సర్ తో కలసి బోళా శంకర్ షూటింగ్ లో పాల్గొన్నా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సర్ భీమ్లా నాయక్ చిత్రాన్ని మెహర్ రమేష్ సర్ తో కలసి చూస్తున్నా’ అంటూ శ్రీముఖి థియేటర్ లో రచ్చ చేస్తున్న ఫొటోస్ ని షేర్ చేసింది.

Sreemukhi Enjoy on bhola shankar Movie Poster Release

Sreemukhi Enjoy on bhola shankar Movie Poster Release

మెహ‌ర్ రమేష్ తో కలసి ఫుల్ హ్యాపీగా భీమ్లా నాయక్ షో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు షేర్ చేయ‌డంతో అవి ఫుల్ వైర‌ల్ గా మారాయి. మెహర్ రమేష్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. వేదాళం రీమేక్ కోసం దాదాపు రేళ్లకు పైగానే వర్క్ చేసాడు మెహర్. ఈ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ కోసం చాలా రోజుల పాటు కష్టపడ్డాడు. తెలుగులో మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్లు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసాడు మెహర్ రమేష్.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp