sreemukhi : వాళ్ల వల్ల ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు పడ్డాను.. తట్టుకోలేక చాలాసార్లు ఏడ్చాను.. శ్రీముఖి
sreemukhi : కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారికి అవకాశాలు అంత సులభంగా దక్కవు. ఓ పని అవ్వాలంటే చెప్పులు అరిగేలా తిరగాలనే సామేత మాదిరిగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పుల జతలు అరిగేలా తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ కష్టాలు మగవాళ్లకి మాత్రమే అనుకుంటుంటారు. కానీ అసలు కష్టాలు ఉండేది ఆడవాళ్ళకే. ఒక అమ్మాయి అవకాశం కోసం ఓ ఆఫీసు గడప తొక్కితే వంకరగా చూసే కళ్ళెన్నో. మాటలతో ఇబందులుపెట్టే వారెందరో ఉన్నారు. అయినా ఇక్కడికొచ్చాక సక్సెస్ అవ్వాలని కసితో ఒక్క ఛాన్స్.
నేనేంటో చూపిస్తా అని ఖడ్గం సినిమాలో సంగీత – రవితేజ చెప్పిన మాదిరిగా ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే తమలోని టాలెంట్ చూపించాలనుకునేవారు కొన్ని వందలమంది ఉన్నారు. ఇక యాంకరింగ్ అంటే చాలా ఈజీ అని అనుకుంటుంటారు. వందల ముందు నిలుచొని భాషలో తప్పులు దొర్లకుండా అందరీని ఎంటర్‌టైన్ చేస్తో ఈవెంట్‌లో హీస్ట్‌గా వ్యవహరించడం అంటే కనపడని కష్టం పడాలి. ఇక రియాలిటీ షోలు, యాంకరింగ్ అంటే ఎపిసోడ్ అయ్యే వరకు ఎన్నిసార్లు మొహానికి టచప్ చేసుకోవాలో లెక్కే ఉండదు. ఎంతసేపు నించొని ఉండాలో చెప్పలేని పరిస్థితి.
Sri mukhi: కొందరు దర్శకులు మరీ శాడిజం చూపిస్తుంటారు.
అలాంటి సందర్భాలలో ఆడవారికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. గంటలకొద్ది నించొని ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం అంటే కత్తిమీద సామే. ఎనర్జీ లెవల్స్ తగ్గకూడదు. ఉదయం మేకప్ వేసుకున్నపుడు ఎంత యాక్టివ్‌గా కనిపించారో అంతే ఎనర్జీతో షూటింగ్ అయ్యే వరకు మెయింటైన్ చేయాలి. కొందరు దర్శకులు మరీ శాడిజం చూపిస్తుంటారు. అలాంటి వారివల్ల యాంకర్ కం నటి శ్రీముఖి చాలాసార్లు ఎవరితో చెప్పుకోలేక ఏడ్చిందట. అసలెందుకు ఈ ఇండస్ట్రీకొచ్చానని మదనపడిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపింది. ఇప్పుడు ఆ కష్టాలు అంతగా లేవని, ప్రస్తుతం సినిమాలు, షోస్‌తో బిజీగా ఉన్నట్టు శ్రీముఖి చెప్పింది. కాగా ఆమె నటించిన క్రేజీ అంకుల్స్ రిలీజ్ కి రెడీగా ఉంది.