Sreemukhi : షోలో శ్రీముఖికి ఎదురుదెబ్బ.. అలా రూ. 5 లక్షలు ఖతం
Sreemukhi : బుల్లితెర రాములమ్మ శ్రీముఖికి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలోకి వచ్చాక ఆ క్రేజ్ మరింతగా పెరిగింది. అంతకు ముందు పటాస్ షోతో ఫుల్ ఫేమస్ అయింది. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక ఆమెకు కాస్త నెగెటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. రాహుల్ సిప్లిగంజ్‌తో పెట్టుకున్న గొడవలు, పెంచుకున్న శత్రుత్వం ఇలా అన్నీ కలిపి శ్రీముఖిని కాస్త బ్యాడ్ చేసింది. కానీ ఆమె చివరకు రన్నర్‌గా నిలిచింది. శ్రీముఖి బిగ్ బాస్ తరువాత కాస్త ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకుంటూ వచ్చింది. బుల్లితెరపై ఆమె చేసిన ప్రోగ్రాంలన్నీ కూడా దెబ్బేస్తూ వచ్చాయి. స్టార్ట్ రీలోడెడ్ అంటూ ఓ మ్యూజిక్ చేసింది.
ఆ తరువాత బొమ్మ అదిరింది అనే షోకు యాంకర్‌గా వెళ్లింది.. అలా అన్ని షోలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు శ్రీముఖికి టైం వచ్చినట్టు అనిపిస్తోంది. స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ ఇలా అన్నింట్లోనూ శ్రీముఖియే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా శ్రీముఖి జీ తెలుగు చేసిన వినాయక చవితి ఈవెంట్‌లో మెరిసింది. ఈ ఈవెంట్‌కు శ్రీముఖి యాంకర్‌గా ఉంది. అయితే ఇందులో సరిగమప సింగర్లు, అదిరింది కామెడీ స్టార్స్, సీరియల్ తారలు, సినీ హీరోలు ఇలా అందరూ వచ్చారు. చివర్లో వంద కేజీల లడ్డూ అని తీసుకొచ్చారు.
దీనిపై వేలం పాట నిర్వహించారు. పది వేల నుంచి అది మొదలైంది. చివరకు ఐదు లక్షల వరకు చేరుకుంది. ఇందులో శ్రీముఖి బుక్కైంది. పది వేలు, ఇరవై వేలు అంటూ ఇలా వెళ్తోంది. భాను శ్రీ.. రెండు లక్షల వరకు పాడింది. అయితే మధ్యలో సింగర్ లేచి.. శ్రీముఖిని బుక్ చేశాడు. ఐదు లక్షలు అని శ్రీముఖి తరుపున పాడాడు. చివరకు ఐదు లక్షలు చెల్లించినట్టు చెక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తానికి శ్రీముఖి ఇలా ఎదురుదెబ్బ తగలడంతో ఐదు లక్షలు పోయినట్టు తెలుస్తోంది.
