Sreemukhi : తగ్గేదే లే అంటున్న శ్రీముఖి.. ఎక్కడకెళ్లిన అందాల ఆరబోత తప్పదు..
Sreemukhi : ఇప్పుడు యాంకర్ అంటే కేవలం మాటలే కాదు గ్లామర్ కూడా ఉండాలనే పాలసీ వచ్చింది. అందుకే యాంకరమ్మలు కేక పెట్టించే అందాలతో రచ్చ చేస్తున్నారు. మాటలతో పాటు గ్లామర్ తో కూడా ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఇక తెలుగులో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వారిలో శ్రీముఖి ఒకరు. రీసెంట్ గా శ్రీముఖి గతంలో ఎప్పుడు లేని విధంగా అందాల ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంది. అక్కడ కేక పెట్టించే అందాలు చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది.
శ్రీముఖిలో దాగి ఉన్న సరికొత్త అందాలు అందరి మనసులు కొల్లగొడుతున్నాయి. మొదట సినీ నటిగా శ్రీముఖి ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అల్లు అర్జున్ జులాయి సినిమాలో ఆమె హీరో సిస్టర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆమె నటిగా పలు రకాల విభిన్నమైన సినిమాలు చేసింది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమే కాకుండా లీడ్ రోల్స్ కూడా చేసింది. కానీ ఆ రూట్లో ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు శ్రీముఖికి మొదట్లో కొన్ని మంచి ఆఫర్స్ వచ్చాయి. జబర్దస్త్ లో కూడా ఆమెకు యాంకర్ గా ఛాన్స్ వచ్చింది.

sreemukhi highly glamorous looks
Sreemukhi : శ్రీముఖి క్యూట్‌నెస్..
కానీ అప్పట్లో ఆమే ఆ కామెడీ షోపై ఆసక్తి చూపలేదు. పటాస్ షో ద్వారాపాపులర్ అయిన శ్రీముఖి అనంతరం ఎన్నో షోలు చేసినప్పటికీ అవేవి కూడా అంతగా క్లిక్కవ్వలేదు. బిగ్ బాస్ షోకి వెళ్లిన తర్వాత ఈ అమ్మడి పేరు మారుమ్రోగింది. రన్నరప్ గా బయటకు వచ్చిన కూడా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక గ్లామర్ విషయంలో శ్రీముఖి ఎప్పటికప్పుడు సరికొత్తగా హైలెట్ అవుతోంది. రీసెంట్ గా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల కాలంలో శ్రీముఖి ఎక్కువగా గ్లామర్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.