Sreemukhi: ఈ ఒక్క ఫొటోతో శ్రీముఖి కి సావిత్రి అంత పేరొచ్చేసింది ..!

Authored By Jyothi | The Telugu News | Updated on: January 25, 2021, 11:01 am

Sreemukhi: బుల్లితెర మీద సందడి చేస్తూ బబ్లీ యాంకర్ గా పాపులర్ అయిన శ్రీముఖి కి ఫ్యాన్ ఫోలోయింగ్ ఎంత ఉందో చెప్పడానికి లెక్క సరిపోదు. పలు టీ షోస్ తో అందరిని ఆటపట్టిస్తూ ఆకట్టుకుంటున్న శ్రీముఖి సినిమాలలో స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తూ కూడా తన అంద చందాలతో కట్టి పడేస్తుంది. శ్రీముఖి అందానికి దాసోహం అంటున్న నెటిజన్స్ కి ఎప్పుడూ ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. యాంకర్ గా నే కాకుండా బిగ్ బాస్ షో లో పాల్గొన్న శ్రీముఖి కి ఆ తర్వాత నుంచి లవ్ ప్రపోజల్స్ కూడా చాలానే వస్తున్నాయట.

sreemukhi latest photos like savithri

sreemukhi latest photos like savithri

Sreemukhi: శ్రీముఖి కి అదేంటే ఆసక్తి బాగా ఎక్కువ ..!

sreemukhi latest photos like savithri

sreemukhi latest photos like savithri

కాని తన కలల రాకుమారుడు ఎక్కడో ఉన్నాడు.. అప్పటి వరకు నా ఈ ఎదురుచూపులు తనకోసమే అంటూ సరదాగా చిలిపి సామాధానాలు చెప్పి సున్నితంగా ఆ ప్రపోజల్స్ ని రిజెక్ట్ చేస్తుంటుంది. అయితే శ్రీముఖి షో లో భాగంగా ఇతర హీరోయిన్స్ గెటప్స్ లో కనిపించి మెప్పించాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే మహానటి సావిత్రిలా కనిపించింది అద్భుతంగా ఉన్నావు.. అన్న ప్రశంసలు అందుకుంటుంది. బుల్లితెర మీద శ్రీముఖి చేసే అల్లరికి ఇక్కడ మహానటి గెటప్ లో హుందాగా ఉన్న ఫొటో కి ఏమాత్రం సంబంధం లేదే.. అని అవాక్కవుతున్న నెటిజన్స్ తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Jyothi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp