Sreemukhi : ప్రేమలో పడిపోయిన శ్రీముఖి.. అతగాడు ఎవరంటే?
Sreemukhi : శ్రీముఖి ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. శ్రీముఖి పలు షోలతో ఇప్పుడు బుల్లితెరపై దూసుకుపోతోంది. ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా ఇలా అన్ని చానెళ్లలో తానే కనిపిస్తోంది. బిగ్ బాస్ షో తరువాత శ్రీముఖి కాస్త ఖాళీగా ఉన్నట్టు అనిపించినా ఇప్పుడు మాత్రం ఫుల్ బిజీగా మారిపోతోంది. మధ్యలో ఆమె చేసిన ప్రతీ షో బెడిసి కొడుతూ వచ్చింది.
బిగ్ బాస్ కంటే ముందుగా.. ఆమె పటాస్ షోతో ఫేమస్ అయింది. పటాస్ షోలోనే రాములమ్మగా శ్రీముఖి ఫేమస్ అయింది. ఆ క్రేజ్‌తోనే ఆమెకు బిగ్ బాస్ షోలో ఆఫర్ వచ్చింది. దీంతో ఎగిరి గంతులు వేసినట్టుంది. అయితే బిగ్ బాస్ షోతో శ్రీముఖికి నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమె పెట్టుకున్న గొడవలే ఆమెను ముంచేశాయి. మూడో సీజన్ విన్నర్ అవ్వాల్సింది.. రన్నర్‌గానే మిగిలిపోయింది.
బయటకు వచ్చిన శ్రీముఖి.. గెలిస్తే ఏముంటుంది.. అక్కడితోనే అయిపోతుంది.. ఓడిపోతోనే ఇంకా ఎంతో చేయగలమంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీముఖి మాత్రం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక.. స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అంటూ స్టార్ మాలో షో చేసింది. అది అంతగా క్లిక్ అవ్వలేదు. ఆ తరువాత జీ తెలుగులో అదిరింది, బొమ్మ అదిరింది అంటూ వచ్చింది.
మధ్యలో ఆ షోలన్నీ అటకెక్కాయి. ఇక ఇప్పుడు జీ తెలుగులో సరిగమప సింగింగ్ షోను చేస్తోంది. ఇందులో సింగర్ శ్రీ సాయి చరణ్ అంటే తనకు ఇష్టమన్నట్టుగా ట్రాక్ నడిపిస్తోంది. తాజాగా తన తండ్రి వస్తే మామయ్య అని పిలిచేసింది శ్రీముఖి. ముగ్గులు వేయడం వచ్చా? అని అంటే.. ముగ్గులోకి దింపడం వచ్చు అంటూ తెగ మెలికల్ తిరిగింది శ్రీముఖి.
