Sreemukhi : ఎట్టకేలకు శ్రీముఖి పెళ్లి ఫిక్స్ .. చివరికి ప్రేమించిన వ్యక్తితో వివాహం ..!
Sreemukhi : బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరు శ్రీముఖి. పటాస్ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే టాప్ యాంకర్ గా పేరు సంపాదించుకుంది. ఈ క్రేజ్ తోనే శ్రీముఖి వెండితెరపై అవకాశాలు వస్తున్నాయి. అడపా దడపా సినిమాలలో నటిస్తూ వెండితెరకు బాగా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో ఓ పాత్రలో నటించి మెప్పించింది. అప్పుడప్పుడు పలు సినిమా ఈవెంట్లకు, ఆడియో ఫంక్షన్లకు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ సందడి చేస్తుంటుంది.
అయితే శ్రీముఖి ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదేళ్లు అవుతుంది. అయినా ఆమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పెళ్లి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పటికే నెట్టింట శ్రీముఖి పెళ్లి వార్తలు చాలానే ట్రెండ్ అయ్యాయి. అయితే తాజాగా అలానే మరోసారి శ్రీముఖి పెళ్లి గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే శ్రీముఖి పెళ్లి గురించి చాలాసార్లు హింట్ ఇస్తూ వచ్చింది. తాజాగా తన పెళ్లి గురించి ఇంట్లో వాళ్లకు చెప్పిందట, ఎట్టకేలకు ఆ అబ్బాయి తోనే పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
శ్రీముఖి చివరికి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు తమ కుటుంబం ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపలేదట. దీంతో శ్రీముఖి ఇన్నాళ్లు ఎదురుచూసి తన కుటుంబం ఒప్పుకునేలా చేసిందట. ఇక శ్రీముఖి వయసు కూడా బాగా ముదిరిపోతుంది. దీంతో ఆమె కుటుంబం కూడా అతడితో పెళ్లి చేయడానికి అంగీకరించారట. అయితే పెళ్లి ఎప్పుడు ఎవరితో అనేది పూర్తి వివరాలను బయటికి తెలపలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.