Sreemukhi : శ్రీముఖిని వాడేస్తున్నారు…. నిజంగానే జాతి రత్నాలు
Sreemukhi : శ్రీముఖి ప్రస్తుతం జాతి రత్నాలు అనే స్టాండప్ కామెడీ షోతో సందడి చేస్తోంది. చాలా రోజుల తరువాత మళ్లీ శ్రీముఖి కమ్ బ్యాక్‌లా ఆ షోను చూస్తున్నారు. మళ్లీ పటాస్ రేంజ్‌లో హిట్ చేయాలని, అవ్వాలని శ్రీముఖి బలంగానే కోరుకుంటోన్నట్టు కనిపిస్తోంది. అయితే శ్రీముఖి పంచ్‌లు వేయడం, తన మీద సెటైర్లు వేయించుకోవడం కొత్తేమీ కాదు. పటాస్ షోలో ఉన్న సమయంలోనూ రోస్ట్ చేయించుకునేది.ఇప్పుడు కూడా శ్రీముఖి మీద స్టాండప్ కమెడియన్లు కౌంటర్లు వేస్తున్నారు. తమ తమ స్కిట్లలో శ్రీముఖిని వాడేస్తున్నారు…
ఒక లేడీ వచ్చి.. విషం ఇచ్చినా తాగుతాను కానీ ఆంటీ అని పిలిస్తే మాత్రం తట్టుకోలేను అని అంటుంది. దీంతో వెంటనే ఆంటీ అని శ్రీముఖి అనేస్తుంది. నువ్వే ఆంటీలా ఉన్నావ్.. నువ్వే పెద్ద ఆంటీలా ఉన్నావ్ అని కౌంటర్ వేస్తుంది. అయితే నువ్ చిన్న ఆంటీ అని శ్రీముఖి అంటుంది.ఇక మరో జంట వచ్చి.. స్వర్గంలో పెళ్లిళ్లు జరుగుతాయ్ అని అంటారు.. మరీ నాకేంటి ఇలా సూర్యకాంతం దొరికిందని అంటాడు. భర్త రమణారెడ్డి లాంటోడు అయితే.. .. సూర్యకాంతమే దొరుకుతుంది.. లేదా శ్రీముఖి దొరుకుతుందా?

Sreemukhi Satires in Jathi Ratnalu Comedy Show
అని అనేస్తుంది. మొత్తానికి ప్రతీ దాంట్లో ఎక్కడో చోట శ్రీముఖి పేరు మాత్రం కనిపిస్తోంది.ఇక ఇందులోనూ నూకరాజు తన బంధువులను పట్టుకొచ్చాడు. తన మేనకోడలని ఫేమస్ చేసేందుకు రెడీ అయ్యాడు. మేనకోడలు అంటూ సూర్యవంశం సినిమాలోలా ఉంటుందని అనుకున్నాను కానీ ఇలా ఉందని అంటాడు. నేను కూడా మామయ్య అంటే వెంకీ మామలా పొగరుగా ఉంటాడు అనుకున్నా కానీ ఇలా షుగరుతో ఉంటాడని అనుకోలేదంటూ తన వ్యాధి మీద కౌంటర్ వేసింది.