Sreemukhi : శ్రీముఖి వింత వీడియో.. షూటింగ్ గ్యాప్‌లో ఇక అదే పని
Sreemukhi : బుల్లితెరపై శ్రీముఖి ఎంతటి పాపులారిటీని దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ షోలకు కేరాఫ అడ్రస్‌గా మారింది. పటాస్ వంటి షోతో శ్రీముఖి క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగింది. టాప్ యాంకర్‌గా శ్రీముఖి మారిపోయింది. ఊపిరి సలపనంత బిజీగా ఉండేది. ఆ సమయంలోనే శ్రీముఖికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ షోకి వెళ్లేముందు శ్రీముఖి బాగానే కసరత్తులు చేసింది. ఫిట్ నెస్ మీద బాగా ఫోకస్ పెట్టేసింది. అలా శ్రీముఖికి బిగ్ బాస్ ఎంట్రీ అనేది చేదు ఫలితాన్నే ఇచ్చింది. శ్రీముఖి బిగ్ బాస్ షోలో నెగెటివ్ ఇమేజ్‌ను తెచ్చుకుంది.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత శ్రీముఖి ఇమేజ్ కాస్త డౌన్ అయింది. ఆమె ఏ షో చేసినా కూడా అంత హిట్ అవ్వలేదు. అన్ని చానెల్స్ తిరిగింది. ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా ఇలా అన్నింట్లోనూ షోలు చేసింది. కానీ ఏ ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. మధ్యలో కొన్ని రోజులు బుల్లితెరకు దూరంగా ఉంటూ వచ్చింది. అదిరింది, బొమ్మ అదిరింది అంటూ బాగానే హల్చల్ చేసింది. కానీ ఆ షోలు మూతపడ్డాయి. ఇక ఇప్పుడు శ్రీముఖి మళ్లీ బిజీ అవుతోంది. ఈటీవీలో జాతి రత్నాలు అంటూ బాగానే సందడి చేస్తోంది. మరో వైపు జీ తెలుగులో సరిగమప షోకు హోస్ట్‌గా మారింది. అలా అటూ ఇటూ బాగానే బిజీగా ఉంటోంది. ఇక అవి కాకుండా సినిమాలతోనూ బిజీగా ఉంది.

Sreemukhi Variety Reel Video Sa Re Ga Ma SHow Set
మొన్నామధ్య క్రేజీ అంకుల్స్ అనే పిచ్చి సినిమాలో నటించింది. అది మరీ నాసిరకంగా ఉందని జనాలు తిప్పికొట్టేశారు. ఇక ఇప్పుడు ఆమె ఫుల్ ఫోకస్ బుల్లితెరపైనే పెట్టేసినట్టుంది. అయితే తాజాగా సరిగమప షో షూటింగ్ గ్యాప్‌లో రీల్ వీడియోలు చేసింది. ఇలా గ్యాప్ దొరికితే శ్రీముఖి వెంటనే రీల్ వీడియోలు చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీముఖి వింత గెటప్పులో కనిపించి.. వింత వింత స్టెప్పులు వేసింది. మొత్తానికి శ్రీముఖి వేసిన స్టెప్పులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి ప్రస్తుతం మెగా ప్రాజెక్ట్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో శ్రీముఖి నటిస్తోంది.
View this post on Instagram