Sri Reddy : ఆ తిండి ఏంది శ్రీ రెడ్డి.. నాన్‌వెజ్‌ని తెగ లాగించేస్తుందిగా..!
Sri Reddy : కాస్టింగ్ కౌచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ శ్రీ రెడ్డి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. శ్రీరెడ్డి చేసిన రచ్చతో నేషనల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది. ఇక అప్పటి నుండి శ్రీరెడ్డిని టాలీవుడ్ వెలేసింది. దాంతో చెన్నైకి మకాం మార్చి అక్కడే వెబ్ సిరీస్ లు సినిమా అవకాశాలకోసం ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు సినిమాలు రాజకీయాలు, సామాజిక అంశాలు ఇలా ఏ టాపిక్ నూ వదలకుండా తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది. అందుకోసం శ్రీరెడ్డి ఓ యూట్యూబ్ చానల్ ను కూడా ప్రారంభించింది. అందులో సరికొత్త వంటలని పరిచయం చేస్తూ అందరిని అలరిస్తూ వచ్చింది.
వెజ్, నాన్‌వెజ్ అన్నింటిని చేసి చూపించిన శ్రీ రెడ్డి ఇప్పుడు రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడ వంటకాలకు రివ్యూలు ఇస్తుంది. తాజాగా చెన్నైలో ఓ రెస్టారెంట్‌కి వెళ్లిన శ్రీ రెడ్డి వెరైటీ వంటకాలని ముందు పెట్టుకొని ఒక్కోక్కటి తింటూ వాటికి రివ్యూ ఇచ్చింది. కొన్నింటికి 10కి 10 ఇవ్వగా కొన్నింటికి ఆరు మార్కులు మాత్రమే ఇచ్చింది. మొత్తానికి తన ముందు పెట్టుకున్న అన్నింటిని శ్రీ రెడ్డి ఎంచక్కా ఆరగించి కడుపు నింపేసుకుంది. కాగా, గతంలో వివాదాల్లో ఉన్న శ్రీరెడ్డి ప్రస్తుతం ప్రశాంతంగా జీవనం సాగిస్తోంది. తన ప్రొఫెషన్ కోసం వంటలు చేసే ఆమె రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడి ఫుడ్ ఎలా ఉందో అనే దానిపై తన అభిప్రాయం తెలియజేస్తుంది.

sri reddy tastes different varieties
Sri Reddy : వెరైటీ రుచులు..
రాజకీయాల నుండి స్పోర్ట్స్ వరకు ప్రతిదానిలో వేలుపెట్టి వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో పోస్టులు, చాట్, లైవ్ ఇలా దేన్నీ వదలకుండా నెటిజన్లకు బోలెడంత స్టఫ్ పంచేస్తుంది. కాగా, ఆ మధ్య సోషల్ మీడియాలో కాస్త యాక్టివిటీ తగ్గించిన శ్రీరెడ్డి ఈ మధ్య మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చి అంతకు మించిన యవ్వారంతో దుమ్మురేపుతోంది. తన ఫేస్ బుక్‌లో వరుస వీడియోలు వదులుతున్న శ్రీరెడ్డి… అప్పుడప్పుడు క్యూట్ ఫొటోలను వదులుతూ.. పొట్టి పొట్టి నిక్కర్లతో లైవ్‌లోకి వస్తూ నెటిజన్లను ఊరికిస్తూ ఉడికిస్తూ కనువిందు చేస్తుంది. బూతును మిక్స్ చేసిన ఈ లైవ్ వీడియోలకు సోషల్ మీడియాలో భారీగానే డిమాండ్ ఉండడంతో అమ్మడు మరికాస్త రెచ్చిపోతుంది.
