Sri Reddy : కొణిదెల నిహారిక విడాకులపై శ్రీ రెడ్డి వీడియో వైరల్…నాగబాబు పై సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగు చలనచిత్ర రంగంలో మెగా డాటర్ కొణిదెల నిహారిక విడాకులు తీసుకోవడం అందరికీ షాక్ కి గురి చేయడం జరిగింది. 2020లో చైతన్య జొన్నలగడ్డతో పెళ్లికాక 2023లో ఉన్నాయి ఈ జంట విడిపోవడం చాలామందికి విస్మయాన్ని కలిగించింది. పరిస్థితి ఇలా ఉంటే నిహారిక విడాకులు గురించి కాంట్రవర్షియల్ బ్యూటీ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన యూట్యూబ్ ఛానల్ లో నిహారిక విడాకుల గురించి శ్రీ రెడ్డి మాట్లాడుతూ నాగబాబు రాజకీయాల్లో చాలా నీతులు చెబుతూ ఉంటాడు.
కానీ ఇంట్లో కూతురే సరిగ్గా పెంచుకోలేకపోయాడు. ఇంట్లో కూతురిని గాలికి వదిలేసి ఆయన రాజకీయాలను ఏం చక్కదిద్దుతాడు అంటూ పరుష పదజాలంతో తిట్టిపారేసింది. నిహారిక కి పెళ్లయిన పెద్ద బిల్డప్ కొడుతూనే ఉంటుంది. విడిపోయాక మరీ బరితెగించి తిరుగుతోంది. దానికి అసలు మొగుడు అంటేనే లెక్కలేదు.. అని తీవ్ర స్థాయిల విమర్శలు చేయడం జరిగింది. ఒకానొక సమయంలో నాగబాబు తనని టార్గెట్ చేసి చాలా రకాలుగా ఇబ్బంది పాలు చేయడం జరిగిందని ఇప్పుడు కర్మ అతని వదల్లేదని శ్రీ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
తనని అప్పట్లో కొన్ని చానల్స్ ద్వారా టార్గెట్ చేసి భయంకరంగా విమర్శలు చేసేవారు. నాకు ఎవరూ లేరని తెగ రెచ్చిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే కర్మ అతని విడిచిపెట్టలేదు అంటూ నిహారిక విడాకులపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్ లో మండిపడింది. నిహారిక విడాకులపై శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
