Sri Reddy : బావ కోసం లాలీపాప్ చేసిన శ్రీ రెడ్డి.. తెగ నోరూరించేస్తుందిగా..!

Authored By Sam C | The Telugu News | Updated on : 2 July 2022, 1:00 pm

Sri Reddy : శ్రీరెడ్డి ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు గ‌తంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు యూట్యూబ్‌, సోష‌ల్ మీడియాని తెగ వాడేసుకుంటుంది. ఏదో ఒక విషయంతో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటీ గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తలదూర్చి తన అంటే ఏంటో నిరూపించింది. అంతే కాకుండా ఘాటూ వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిలో పడింది.కొందరి నటులను తన నోటికి వచ్చిన మాటలతో బాగా విమర్శలు చేస్తూ వార్తకెక్కుతుంది.ఇక ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే.నిత్యం ఏదో ఒక పోస్టును వైరల్ గా మారుస్తుంది.

ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ తన ఎక్స్పోజింగ్ లతో నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది. ఇక కొందరి రాజకీయ నాయకుల వారిని కూడా అస్సలు వదలట్లేదు. యూట్యూబ్‌లో శ్రీరెడ్డి బాగా బిజీ అయిపోయింది. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ప్రస్తుతం రూటు మార్చింది. యూట్యూబ్‌లో వంటలతో అదరగొడుతోంది. ఇటీవ‌ల ఆమె ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఫుడ్‌ను రుచి చూసింది. ఎంజాయ్ చేసింది. దీంతోపాటు ఆ ఫుడ్‌కు మార్కులు కూడా వేసింది. రెస్టారెంట్లో తిన్న ఫుడ్‌ 10 కి 6 మార్కులు వేసింది. ఎప్పుడు తన వీడియోలు పోస్టింగ్ చేసే ఆమె రెస్టారెంట్ లో జరిగిన దాన్ని పోస్టు చేయడంతో అందరు ఆసక్తిగా చూశారు.

Sri Reddy Village Style Cooking video on viral

Sri Reddy Village Style Cooking video on viral

Sri Reddy : శ్రీ రెడ్డి అందాల ర‌చ్చ‌..

తన ప్రొఫెషన్ కోసం వంటలు చేసే ఆమె రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడి ఫుడ్ ఎలా ఉందో అనే దానిపై తన అభిప్రాయం తెలియజేసింది. శ్రీరెడ్డి మ‌ళ్లీ త‌న వంట‌కాల‌కు ప‌ని చెప్పింది. లాలీపాప్ వంట‌కం చేసి నోరూరించింది. ఇందులో శ్రీ రెడ్డి అందాల ఆర‌బోత‌తో పాటు కేక పెట్టించే క్యూట్ లుక్స్ మ‌తులు పోగొట్టాయి. బ్యూటీ మెస్మ‌రైజింగ్ లుక్స్ కేక పెట్టించాయి. శ్రీ రెడ్డి వంట‌కాల‌తో పాటు అందాలు అదుర్స్ అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. . రకరకాల వంటలకాలతో ఘుమఘుమలాడిస్తున్న శ్రీరెడ్డి అచ్చ తెలుగు నాటు వంటకాలను రుచిచూపిస్తుంది.ఏదేమైన శ్రీ రెడ్డి హంగామా ఇటీవ‌లి కాలంలో కేక పెట్టిస్తుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి వంట‌కాల‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి