Bhola Shankar Movie : భోళాశంకర్ సినిమాకి చిరంజీవినే సూట్ అవుతారు.. ప‌ట్టుబ‌ట్టి చేయ‌మ‌న్న స్టార్ హీరో…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Bhola Shankar Movie : భోళాశంకర్ సినిమాకి చిరంజీవినే సూట్ అవుతారు.. ప‌ట్టుబ‌ట్టి చేయ‌మ‌న్న స్టార్ హీరో…!

Bhola Shankar movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇక ఇటీవల ఆయన వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ప్రస్తుతం ‘ భోళాశంకర్ ‘ సినిమాలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 August 2023,9:00 am

Bhola Shankar movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇక ఇటీవల ఆయన వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ప్రస్తుతం ‘ భోళాశంకర్ ‘ సినిమాలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తమిళంలోని వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఎన్నో ఏళ్ల క్రిందట వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

అక్కడక్కడ మార్పులు చేసి తెలుగువారికి నచ్చేలా మెహర్ రమేష్ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 11న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. ఆమె భర్తగా యంగ్ హీరో సుశాంత్ నటించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆగస్టు 6వ తేదీన గ్రాండ్గా హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ క్రమంలోనే భోళా శంకర్ సినిమాని మిస్ చేసుకున్న హీరో గురించి న్యూస్ వైరల్ అవుతుంది.

Star hero miss the Bhola Shankar movie

Star hero miss the Bhola Shankar movie

ఈ సినిమాని మిస్ చేసుకున్న హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాని ఎప్పటినుంచో రీమేక్ చేయాలని పవన్ అనుకున్నాడట. కానీ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వలన ఈ సినిమా హోల్డ్ లో ఉంచుతూ వచ్చారట. అయితే పవన్ ఎంతో ఇష్టంగా రీమేక్ చేయాలనుకున్న తను బిజీగా ఉండడం వలన ఈ సినిమాను మా అన్నయ్యతో చేయండి అని సలహా ఇచ్చారట. అలా ఈ సినిమా చిరంజీవి చేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవికే సూట్ అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది