Dasara Movie : దసరా సినిమా కథ వినకుండానే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ..?

 Authored By prabhas | The Telugu News | Updated on :31 March 2023,1:00 pm

Dasara Movie : నాని హీరోగా తెరకెక్కిన ‘ దసరా ‘ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. ఇక ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. డైరెక్టర్ గా మొదటి సినిమా అయినప్పటికీ శ్రీకాంత్ ఓదెల ఎంతో క్లియర్గా జనాలకు తన కథ అర్థమయ్యేలా అద్భుతంగా తీశాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అయితే డైరెక్టర్ మొదటగా ఈ కథ రాసుకున్నప్పుడు రామ్ చరణ్ ని హీరోగా తీసుకోవాలని

star hero reject Dasara movie

star hero reject Dasara movie

అనుకున్నాడని న్యూస్ వైరల్ అవుతుంది.ఈ కథకి బడా హీరో అయితే మరింత క్రేజ్ వస్తుందని, సినిమాకి న్యాయం జరుగుతుందని అనుకున్నారట. కానీ అంత పెద్ద హీరో తనకి ఛాన్స్ ఇవ్వడని తన ఆశలను వదులుకున్నాడట. ఆ తర్వాత ఈ కథను యంగ్ హీరో నితిన్ కి చెప్పారట. అయితే నితిన్ కి ఈ స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు కథ వినకుండానే రిజెక్ట్ చేశాడట. కొత్త డైరెక్టర్ కావడంతో కెరీర్ రిస్కులో పెట్టడం ఎందుకని నితిన్ ఆలోచించి ఈ సినిమాకి నో చెప్పాడని న్యూస్ వైరల్ అవుతుంది. ఆ తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు హీరోలను కూడా ట్రై చేశారట.

Nithin : ఆ నాని సూపర్ హిట్ సినిమా సీక్వెల్లో నితిన్ హీరోగా చేయబోతున్నాడా..  | Bollywood Life తెలుగు

ఫైనల్ గా నానికి ఈ కథ కరెక్ట్ గా సూట్ అవుతుందని భావించి ఆయన దగ్గరికి వెళ్లి కథ చెబుతున్నప్పుడు వెంటనే నాని ఈ సినిమా నాకు ఓకే అని అగ్రిమెంట్ పై సైన్ కూడా చేశాడట. ఈ క్రమంలోనే కొందరు కోరి వచ్చిన అదృష్టాన్ని మిస్ చేసుకున్నాడు నితిన్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే వరుస ప్లాఫులతో ఉన్న నితిన్ ఈ చక్కని అవకాశాన్ని వదులుకున్నాడని ఫ్యాన్స్ నిరాశ వ్యక్త పరుస్తున్నారు. నితిన్ టైం బాగోలేదని మరోసారి రుజువయింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా నాని దసరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి