Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరొక రాజమౌళి – ఇది కదరా Goosebumps న్యూస్ అంటే !

Advertisement

Rajamouli : నాని నటించిన దసరా సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ కూడా మేకప్ లేకుండా నటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. ప్రతి ఈవెంట్లో నాని మాట్లాడి మాటలు చూస్తుంటే ఒక గొప్ప కల్ట్ క్లాసిక్ సినిమాలో నటించాను అనే ఆనందం కనబడుతుంది. కేవలం నాని మాత్రమే కాదు కీర్తి సురేష్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. తన కెరీర్ లో మహానటి లాంటి మైల్డ్ స్టోన్ సినిమాగా

Nani interesting comments about Rajamouli and Dasara movie director
Nani interesting comments about Rajamouli and Dasara movie director

ఈ మూవీ నిలుస్తుంది కీర్తి సురేష్ బలంగా నమ్ముతుంది. ఈ సినిమాలో ఆమె పోషించిన వెన్నెల పాత్ర ఆ రేంజ్ లో ఉంటుందట. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్, టీజర్, పోస్టర్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలను నిలిపేలా చేస్తున్నాయి. మరో మూడు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది దీంతో సినిమా టీం ప్రమోషన్స్ ను వేగంగా జరుపుతుంది. నిన్న ఈ సినిమాకి సంబంధించి దసరా ధూంధాం అని ఈవెంట్ అనంతపురంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది. ఈ ఈవెంట్లో నాని మాట్లాడుతూ

Advertisement

RRR-maker SS Rajamouli lauds Nani's 'impressive massy makeover' in Dasara  teaser | Regional Indian Cinema

కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నాని మాట్లాడుతూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కి ఇది మొట్టమొదటి సినిమా అంటే నమ్మడం చాలా కష్టం, అతను కోరుకున్నట్లు అవుట్ పుట్ వచ్చేంతవరకు నిద్రపోని వ్యక్తి, అతని అసిస్టెంట్ టీమ్ మొత్తం కూడా అలానే ఉంటుంది. ఈరోజు నేను బల్లగుద్ది చెప్తున్నాను రాబోయే రోజుల్లో ఈ సినిమాకి పనిచేసిన 12 మంది అసిస్టెంట్ డైరెక్టర్ లు టాలీవుడ్ ను ఏలేసే రాజమౌళి రేంజ్ లో ఎదుగుతారు. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ల పనితనం గురించి మీరే చెప్తారు అంటు నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement