Yevadu movie : బ్లాక్ బస్టర్ ఎవడు మూవీ ఏ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..?

Authored By vamana sai | The Telugu News | Updated on : 11 July 2021, 5:30 pm

Yevadu movie : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన కథ అనివార్య కారణాల వల్ల ఆ హీరో చేతి నుంచి మరో హీరోకి వెళుతుండటం చాలా కామన్‌గా జరుగుతుంటాయి. ఇలా ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే ఇలా చేసిన సినిమాలు ఫ్లాప్‌గాను మిగిలినవి ఉన్నాయి. పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్‌తో చేయాల్సిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, పోకిరి సినిమాలు రవితేజ, మహేష్ బాబు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇలా చాలా సినిమాలు ఒకరు చేయాల్సింది ఇంకొకరు చేసి హిట్స్ అందుకున్నారు. ఇలాంటి సూపర్ హిట్ సినిమా ఇద్దరు సోదరులకి చెప్పగా వాళ్ళు రిజెక్ట్ చేశారట.

star heroes who rejected Yevadu movie

star heroes who rejected Yevadu movie

ఆ సినిమా మెగా హీరోలు చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమానే ఎవడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. అల్లు అర్జున్ చేసింది గెస్ట్ రోల్. ఆయనకి జంటగా కాజల్ అగర్వాల్ నటించింది.   అల్లు అర్జున్ కొనసాగింపు పాత్రల్లో రాం చరణ్ నటించాడు. ఆయనకి జంటగా శృతి హాసన్ నటించింది. ఈ సినిమాను హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఫేస్ హాఫ్ అనే సినిమా ఇన్స్పిరేషన్‌గా రూపొందించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. సినిమా కథ అనుకున్నప్పుడే సోషల్ మీడియాలో ఈ సినిమా కాపీ అనే కామెంట్స్ కూడా వినిపించాయి.

Yevadu movie : మెగా హీరోలకి ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది.

star heroes who rejected Yevadu movie

star heroes who rejected Yevadu movie

ఆ కారణమా లేక కథ నచ్చలేదా తెలీదు గానీ ముందు ఈ కథ దర్శకుడు వంశీపైడిపల్లి చెప్పింది నందమూరి సోదరులు జూనియర్ ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్‌ లకి. వారికి ఈ కథ అంతగా నచ్చకపోవడం, అదే సమయంలో   ఇద్దరు వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా  ఉండటంతో దీనిని చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇదే కథను వంశీపైడిపల్లి అల్లు అర్జున్, రాం చరణ్‌లకి చెప్పాడు. అంతేకాదు ఈ కథ ఇన్స్పిరేషన్ సినిమాను చూపించాడట. దర్శకుడు   చెప్పిన నరేషన్ బాగా నచ్చడంతో రాం చరణ్ ఒకే సిట్టింగ్‌లో రెండవ ఆలోచన లేకుండా ఓకే చేశాడు.   దిల్ రాజు ఈ సినిమాను 35కోట్లతో నిర్మించాడు. 60 కోట్ల వరకు వసూలు చేసింది.   మెగా హీరోలకి ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఓహో అలా ప్లాన్ చేశారా?.. సుమా మామూల్ది కాదుగా!

ఇది కూడా చ‌ద‌వండి ==> జ‌బ‌ర్ద‌స్త్ నరేష్ ఏజ్ ఎంతో తెలిస్తే షాకవుతారు..ఇతను జూనియర్ కాదు చాలా సీనియర్..!

ఇది కూడా చ‌ద‌వండి ==>  గు.. అంటూ అనసూయ బూతు మాట.. షాకైన అభి,రోజా.. వైర‌ల్ వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> పదిన్నర అయింది ఏం లేదా?.. రష్మిని నేరుగా అడేసిన సుధీర్.. వైర‌ల్ వీడియో

Advertisement

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి