Anchor Suma : ఓహో అలా ప్లాన్ చేశారా?.. సుమా మామూల్ది కాదుగా!
Anchor Suma సుమా హోస్ట్‌గా వచ్చే క్యాష్ షో గురించి అందరికీ తెలిసిందే. ప్రతీ శనివారం రాత్రి తొమ్మిది గంటల 30 నిమిషాలకు వచ్చే ఈ షోకు మంచి ఆదరణే ఉంటుంది. అలా ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో క్యాష్ షోకు బయటి స్టూడెంట్స్‌ని తీసుకురావడం అంత సులభమైన పని కాదు. అందుకే గత కొన్ని వారాలుగా కాలేజ్ స్టూడెంట్స్ రౌండ్ తీసేశారు. సర్వే పేరిట వారితో చెప్పించే సమాధానాలు వేరేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈటీవీ షో షూటింగ్‌లన్నీ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతున్నాయి.

Anchor Suma Jabardasth Artist Families In Suma Cash Show
Anchor Suma బర్దస్త్ ఆర్టిస్ట్‌ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ
అలా కాలేజ్ స్టూడెంట్ రౌండ్‌ను ఢీ కంటెస్టెంట్లు, అక్కడి సభ్యులతో కానిచ్చేస్తున్నారు. దాన్ని కూడా లైవ్‌లో కాకుండా ఎడిట్ చేసి పెట్టేస్తున్నారు. గత వారం ఇమాన్యుయేల్ చేత ప్రశ్నలను అడిగించారు. అలా మొత్తానికి ఏదోలా షోను ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పట్టుకొచ్చి షోలో నింపేశారు. ఇక సర్వే చేయడానికి మిగతా వాళ్లు అక్కర్లేదు అన్నట్టుగా తయారైంది వ్యవహారం. ఇందులో జబర్దస్త్ ఆర్టిస్ట్‌ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు.

Anchor Suma Jabardasth Artist Families In Suma Cash Show
వచ్చే వారానికి సంబంధించిన క్యాష్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా వచ్చింది. ఇందులో నూకరాజు, ఇమాన్యుయేల్, బాబు, ప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. ఇక ఒక్కొక్కరు తమ ఫ్యామిలీ కష్టాలను చెప్పుకొచ్చారు. తమ కోసం తమ కుటుంబాలు ఎంత కష్టపడ్డారు, ఎన్ని త్యాగాలు చేశారో బయటపెట్టేశారు. నూకరాజు అయితే తన అన్న గురించి చెబుతూ కాళ్లు మొక్కేశారు. తన అన్న జీవితం త్యాగం చేసుకోవడం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెబుతూ కంటతడి పెట్టించేశారు. మొత్తానికి ఫ్యామిలీ ఎమోషన్స్ తీసుకొచ్చి సుమ తన షో దూసుకుపోయేలా చేస్తోంది.

Anchor Suma Jabardasth Artist Families In Suma Cash Show
