Sudheer And Rashmi : పదిన్నర అయింది ఏం లేదా?.. రష్మిని నేరుగా అడేసిన సుధీర్.. వైరల్ వీడియో
Sudheer And Rashmi : సుధీర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్‌ను ప్రతీ ఒక్కరూ వాడేసుకుంటున్నారు. ఇక జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అయితే మామూలుగా వాడుకోవడం లేదు. మల్లెమాల వాడకం మామూలుగా ఉండదని అందరికీ తెలిసిందే. ఈ జోడి మీద ఏకంగా ఎన్నో ప్రత్యేకమైన షోలనే చేశారు. ఈ ఇద్దరికి పెళ్లి చేశారు.. రెండు ఈవెంట్లను వారి మీద ప్లాన్ చేసి దుమ్ములేపేశారు. అలా ఈ ఇద్దరి పెళ్లి గోలను వాడేసుకుంటూ టీఆర్పీలను రాబట్టుకుంటున్నారు.

Sudheer And Rashmi Im Hyper Aadi Skit
Sudheer And Rashmi సూర్యరశ్మి ఉన్నంత కాలం సుధీర్ రష్మీ ఉంటారు..
అయితే తాజాగా మళ్లీ అదే గోలను రిపీట్ చేశారు. అయితే ఈ సారి సుధీర్ రష్మీని హైపర్ ఆది వాడుకున్నాడు. తన స్కిట్ కోసం ఢీ షోను రప్పించినట్టు అయింది. ఢీలో దీపిక పిల్లి, రష్మీ, సుధీర్, ఆది చేసే హంగామా గురించి అందరికీ తెలిసిందే. ఆ జోడిలతోనే హైపర్ ఆది జబర్దస్త్ షోలో స్కిట్ వేశాడు. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను వదిలారు. ఇందులో హైపర్ ఆది దీపికని, సుధీర్ రష్మిని పెళ్లి చేసుకున్నట్టు చూపించారు.

Sudheer And Rashmi Im Hyper Aadi Skit
ఇక సుధీర్ తన స్టైల్లో డైలాగ్‌లు చెప్పడం మొదలుపెట్టేశాడు. సూర్యరశ్మి ఉన్నంత కాలం సుధీర్ రష్మీ ఉంటాడని అన్నాడు. ఆ మాటకు రష్మీ ఫిదా అయిపోతూ వయ్యారాలు ఒలకబోసింది. నువ్ ఆ ఓలేటీ లక్ష్మీలా వయ్యారాలకు పోకు.. సూర్యరశ్మి అంటే పగలే ఉంటుంది.. మరి రాత్రి ఎక్కడ ఉంటాడో అడుగు అని సుధీర్ గురించి రష్మికి హైపర్ ఆది హింట్ ఇచ్చాడు. సుధీర్ ఏం చూస్తున్నావ్ అడుగు మరి.. అని రష్మి హైపర్ ఆది మీదకు ఉసిగొల్పింది. అలాంటి సమయంలోనూ సుధీర్ తన బుద్ది చూపించుకున్నారు. పదిన్నర అయింది ఏం లేదా? అని కొంటెగా రష్మిని సుధీర్ అడిగేశాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు. హైపర్ ఆదిని అడుగు అని రష్మీ అనడం.. అతడినా? అని సుధీర్ షాక్ అవ్వడం.. అడిగితే బాగుండదని రోజా మధ్యలో పంచ్ వేయడంతో అందరూ నవ్వేశారు.

ఇది కూడా చదవండి ==> ఎక్స్ ప్రెస్ హరిని లాగిపెట్టి కొట్టిన అషూ రెడ్డి! వీడియో
ఇది కూడా చదవండి ==> బిగ్ బాస్ బ్యూటీని చంపేస్తానంటూ బెదిరిస్తున్న వ్యక్తి..!
ఇది కూడా చదవండి ==> సమంత తల్లి కాబోతోందన్న సీక్రెట్.. అసలు విషయం ఇలా బయటపడిందా..!
ఇది కూడా చదవండి ==> అప్పుడలా.. ఇప్పుడిలా.. వైరల్ అవుతున్న వంటలక్క రేర్ ఫిక్స్