Anasuya Bharadwaj : గు.. అంటూ అనసూయ బూతు మాట.. షాకైన అభి,రోజా.. వైర‌ల్ వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya Bharadwaj : గు.. అంటూ అనసూయ బూతు మాట.. షాకైన అభి,రోజా.. వైర‌ల్ వీడియో

 Authored By bkalyan | The Telugu News | Updated on :10 July 2021,8:30 pm

Anasuya Bharadwaj జబర్దస్త్ షో అంటేనే బూతుల మయం అని అందరికీ తెలిసిందే. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు హద్దులు దాటుతున్నాయని అందరూ వేలెత్తి చూపిస్తున్నా కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా రోజురోజుకీ ఆ స్థాయి, ఆ ఘాటుదనం పెరుగుతూనే ఉంది. ఆ పైత్యం ఆర్టిస్ట్‌లు, టీం లీడర్ల నుంచి ఇప్పుడు యాంకర్ల వరకు చేరింది. ఇక రాను రాను జడ్జ్‌లు కూడా ఆ స్థాయి బూతు మాటలను ప్రయోగిస్తారేమో చూడాలి.

anasuya bharadwaj double meaning in jabardasth

anasuya bharadwaj double meaning in jabardasth

అభి స్కిట్‌లో నోరు జారిన అనసూయ Anasuya Bharadwaj

తాజాగా అనసూయ Anasuya Bharadwaj ఓ రేంజ్‌లో బూతు మాటను వదిలబోయింది. అదిరే అభి స్కిట్‌లో అనసూయ నోరు జారి అలా అనబోయిందో. లేదో అదంతా కూడా ముందే స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో కానీ దారుణమైన మాట అనబోయింది. అదుర్స్ సినిమాలో భట్టూ, చారిలు మాట్లాడుకున్నట్టుగా కథ మారిపోయింది. అసలు ఇంతకీ అదిరే అభి టీంలోకి అనసూయ Anasuya Bharadwaj ఎందుకు ఎంటరైంది? ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో చూద్దాం.

anasuya bharadwaj double meaning in jabardasth

anasuya bharadwaj double meaning in jabardasth

వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోలో అదిరే అభి వేసిన స్కిట్‌లో అనసూయ ఎంటరైంది. అభి టీంలోని రాము అనే వ్యక్తి ఓ ప్రశ్న అడిగారు. గుర్రానికి ముందుకు.. ఏనుగుకు వెనక ఉండేది ఏంటి అని అని ఓ పొడుపు కథ వేశాడు. దానికి అనసూయ సమాధానం ఇస్తూ ‘గు’ అని అంతటితో ఆపేసింది. దీంతో షాకైన అభి.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ అనేశాడు. దీంతో రోజా కూడా దెబ్బకు షాకైంది.

YouTube video

ఇది కూడా చ‌ద‌వండి ==> పదిన్నర అయింది ఏం లేదా?.. రష్మిని నేరుగా అడేసిన సుధీర్.. వైర‌ల్ వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎక్స్ ప్రెస్ హరిని లాగిపెట్టి కొట్టిన అషూ రెడ్డి! వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> బిగ్ బాస్ బ్యూటీని చంపేస్తానంటూ బెదిరిస్తున్న‌ వ్యక్తి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> సమంత తల్లి కాబోతోందన్న సీక్రెట్.. అసలు విషయం ఇలా బయటపడిందా..!

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది