Sr NTR : సీనియర్ ఎన్టీఆర్ దాదాపు కాళ్లు పట్టుకున్నాడు .. అయినా సరే ఆయన పక్కన చేయనని చెప్పేసిన స్టార్ హీరోయిన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sr NTR : సీనియర్ ఎన్టీఆర్ దాదాపు కాళ్లు పట్టుకున్నాడు .. అయినా సరే ఆయన పక్కన చేయనని చెప్పేసిన స్టార్ హీరోయిన్..!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 February 2023,9:00 pm

Sr NTR : మహానటుడు ఎన్టీఆర్, మహానటి సావిత్రి కలిసి నటించిన ‘ కన్యాశుల్కం ‘ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గురజాడ అప్పారావు రాసిన కథ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలో సావిత్రి పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. వేశ్య పాత్ర అయినా సమాజ హితం కోసం ఆమె చేసిన త్యాగాలు నవరసరాగాలని ఈ సినిమాలో చూపించారు. ఈ వేశ్య పాత్రకు , సావిత్రి నటనకు మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమాలో మొదటిగా వేశ్య పాత్రలో హీరోయిన్ అంజలిని తీసుకోవాలని డైరెక్టర్ అనుకున్నారు. అంతేకాదు ఆమెను దృష్టిలో పెట్టుకొని అన్నగారికి కూడా చెప్పారు.

star heroin not act with Sr NTR because of that reas0n

star heroin not act with Sr NTR because of that reas0n

ఎన్టీఆర్ కూడా ప్రేక్షకులు తప్పకుండా మెచ్చుతారు అని కితాబు ఇచ్చారు. అయితే కథ విన్న అంజలి వేశ్య పాత్రలో నేను చేయడమా నా అభిమానులు హర్ట్ అవుతారు అంటూ నటించనని చెప్పేశారట. అయితే దర్శకుడు నుంచి ఎన్టీఆర్ వరకు చాలా మంది నచ్చ చెప్పారట. ఈ సినిమా ట్రెండ్ సెట్ అవుతుంది మంచి పేరు వస్తుందని కూడా చెప్పారట. ఎన్టీఆర్ అయితే ఈ పాత్ర మీ కెరీర్ లోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని కూడా రిక్వెస్ట్ చేశారట. ఈ విషయంలో అంజలి ఏమాత్రం ఒప్పుకోలేదట. వేశ్య పాత్రలో అస్సలు నటించేదే లేదని గట్టిగా చెప్పేశారట.

దీంతో చేసేదేమి లేక ఈ సినిమాలో సావిత్రిని తీసుకున్నారు. వేశ్య పాత్ర సావిత్రికి మంచి పేరును తీసుకొచ్చింది. సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఈ కన్యాశుల్కం సినిమా చూసినా, నవల చదివిన కొత్తగా అనిపిస్తుంది. ఏ పాత్రనైనా అలవోకగా చేయగలిగే సత్తా మహానటి సావిత్రికే దక్కుతుంది. ఆమె ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు చేసే మహానటిగా పేరు సంపాదించుకున్నారు. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇప్పటికి మహానటి సావిత్రిని తలుచుకొని వారు ఉండరు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది