Tollywood Actors : టాలీవుడ్ హీరోయిన్స్ పారితోషికంను భారీగా పెంచారు. ఒకప్పుడు 50 లక్షల పారితోషికం అంటే చాలా గొప్ప విషయం. హీరోలు పది కోట్లకు పైగా తీసుకునే సమయంలో కూడా హీరోయిన్స్ పారితోషికం కేవలం అర కోటి మాత్రమే.. అదే అప్పట్లో అత్యధికం. ఆ భారీ పారితోషికం ఇప్పుడు నాలుగు అయిదు కోట్లకు పెరిగింది. బాలీవుడ్ హీరోయిన్స్ అయితే ఏకంగా పాతిక కోట్లు కూడా తీసుకుంటూ రికార్డులు నెలకొల్పుతున్నారు. ఇక సౌత్ లో నయనతార తో పాటు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ నాలుగు నుండి అయిదు కోట్ల రూపాయలను దక్కించుకుంటూ ఉన్నారు. వీరికి దక్కే పారితోషికం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్ద హీరోల సినిమాలకు హీరోయిన్ పారితోషికం టాపిక్ కాదు కాని చిన్న హీరోల సినిమాలో నటించే పెద్ద హీరోయిన్స్ పారితోషికం ఎప్పుడు కూడా హాట్ టాపిక్.
తాజాగా సంక్రాంతి కానుకగా వచ్చిన రెండు చిన్న చిత్రాల్లో పెద్ద హీరోయిన్స్ నటించడం జరిగింది. గల్లా అశోక్ హీరోగా నటించిన హీరో సినిమా లో నిధి అగర్వాల్ కనిపించిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో హీరోయిన్ గా నటించినందుకు గాను నిధి అగర్వాల్ కు ఏకంగా కోటికి పైగా పారితోషికం దక్కిందట. ఆమె పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో నటించడం తో పాటు ఆమెకు తమిళంలో అత్యధిక క్రేజ్ ఉంది. అందుకే ఆమెను ఈ సినిమా లో నటింపజేసేందుకు ఏకంగా కోటి రూపాయలు ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ పారితోషికం విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.హీరో సినిమా లో నటించినందుకు గాను నిధి కి కోటి పారితోషికం దక్కింది.
అయితే దిల్ రాజు వారసుడు అశ్విన్ నటించిన సినిమా రౌడీ బాయ్స్ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ నటించినందుకు గాను ఏకంగా కోటిన్నర రూపాయలను పారితోషికంగా దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ స్థాయి పారితోషికం ఇవ్వడంకు ప్రథాన కారణం హీరో తో అనుపమ పరమేశ్వరన్ రొమాంటిక్ సన్నివేశాలు మరియు లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అందుకే ఈ సినిమా కు గాను ఆమెకు ఇంత పారితోషికం అంటూ వార్తలు వస్తున్నాయి. కేవలం ముద్దు సీన్స్ మరియు రొమాంటిక్ సన్నివేశాలకు కోట్ల పారితోషికం ఇవ్వడం ఏంటో అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ సన్ని వేశాలు లేకుంటే పాతిక లక్షలు కూడా వారికి ఇచ్చే అవకాశం లేదు అనేది కొందరి అభిప్రాయం.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.