Jabardasth : మొత్తం జబర్దస్త్‌ దిగినా కూడా ‘కామెడీ స్టార్స్‌’ కు వచ్చింది రెండే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth : మొత్తం జబర్దస్త్‌ దిగినా కూడా ‘కామెడీ స్టార్స్‌’ కు వచ్చింది రెండే!

 Authored By himanshi | The Telugu News | Updated on :6 February 2022,12:30 pm

Jabardasth : ఈటీవీ లో జబర్దస్త్ ప్రారంభమై తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అయినా కూడా ఆ కామెడీ షో ఇప్పటికి కూడా నెంబర్ వన్ తెలుగు కామెడీ షో గా కొనసాగుతుంది. ఇప్పటికే జెమినీ టీవీ జీ తెలుగు స్టార్‌ మా టీవీ లు జబర్దస్త్ ను బీట్‌ చేసేందుకు పలు కామెడీ షో లను తీసుకు వచ్చాయి. కానీ ఏ ఒక్క కామెడీ షో కూడా జబర్దస్త్ రేటింగ్‌ దరి కూడా చేరలేక పోయింది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ పూర్తిగా జబర్దస్త్ కమెడియన్స్ తోనే కొనసాగుతోంది. జబర్దస్త్ జడ్జ్‌ నాగబాబు మరియు ఢీ జడ్జ్‌ పూర్ణ లు జడ్జ్‌ లుగా.. జబర్దస్త్ మాజీ కమెడియన్స్ అయిన ధనరాజ్, వేణు, అవినాష్, ఆర్ పి, అప్పారావు, అదిరే అభి ఇంకా తదితర జబర్దస్త్ కమెడియన్స్ తో నే స్టార్ మా కామెడీ స్టార్స్ ను నిర్వహిస్తూ ఉంది.

కామెడీ స్టార్స్ ధమాకా అంటూ టెలికాస్ట్ అయిన మొదటి ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జబర్దస్త్ రేంజ్ లోనే కామెడీ స్కిట్స్ ఉన్నాయంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ వచ్చిన రేటింగ్ మరి దారుణంగా ఉంది. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమాలకు 5 నుండి 6 రేటింగ్ వస్తే స్టార్ మా లో ప్రసారమైన కామెడీ స్టార్స్ కు మాత్రం కేవలం 2 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇంతకు ముందు తో పోలిస్తే కామెడీ స్టార్స్ రేటింగ్ కాస్త మెరుగ్గా ఉందనే అనుకోవాలి. కానీ 2 రేటింగ్ తో ఆ స్థాయి కామెడీ షో ను నడపడం అంటే కాస్త కష్టమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జబర్దస్త్ కు మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కు వచ్చే రేటింగ్ తో పోలిస్తే కామెడీ స్టార్ రేటింగ్ అత్యంత తక్కువ కనుక స్టార్ మా ఏ సమయంలో నైనా ఆ కామెడీ షో ఆపివేసే అవకాశాలు లేకపోలేదు.

star maa tv comedy stars comedy show and jabardast show trp ratings

star maa tv comedy stars comedy show and jabardast show trp ratings

Jabardasth : జబర్దస్త్‌ టైమింగ్ లో స్టార్‌ మా కామెడీ స్టార్స్ రావాలి…

అందుకే ప్రేక్షకులు అయినా కమెడియన్స్ అయినా మరో కామెడీ షో కాకుండా జబర్దస్త్ నే కామెడీ కోసం ఆశ్రయిస్తే బెటర్ అన్నట్లుగా అభిప్రాయం తో ఉన్నారు. కామెడీ స్టార్స్ కు అతి తక్కువ రేటు రావడానికి ప్రథాన కారణం దాన్ని టెలికాస్ట్ చేసిన టైం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో ప్రైమ్ టైం లో అంటే రాత్రి 9:30 గంటలకు టెలికాస్ట్ చేస్తారు. కానీ ఆదివారం మధ్యాహ్నం సమయంలో కామెడీ స్టార్స్ ని టెలికాస్ట్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం అంటే పర్లేదు కానీ మధ్యాహ్నం టైం లో జనాలు టీవీల ముందు కూర్చుంటారు అంటే అది పొరపాటే అవుతుంది అంటూ బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కామెడీ స్టార్ ప్రైమ్‌ టైమింగ్ టెలికాస్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి రేటింగ్ వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్టార్‌ మా వారు ఈ కామెడీ షో ను మంచి టైమింగ్ లో తీసుకురావాలంటూ ప్రేక్షకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయమై స్టార్‌ మా వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది