Sudheer – Rashmi : సిగ్గుమొగ్గలేసింది.. రష్మీ సుధీర్ మామూలుగా లేదు.. వీడియో! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudheer – Rashmi : సిగ్గుమొగ్గలేసింది.. రష్మీ సుధీర్ మామూలుగా లేదు.. వీడియో!

 Authored By bkalyan | The Telugu News | Updated on :1 April 2021,9:51 am

Sudheer – Rashmiబుల్లితెరపై రష్మీ సుధీర్ అనే అంకం ఎప్పటికీ బోర్ కొట్టదు. ఎన్ని ఏళ్లు అవుతున్నా కూడా ఆ జంట అందరినీ అలరిస్తూనే ఉంటుంది. అలా సుధీర్ రష్మీ జంటగా బుల్లితెరపై చేసే కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతూనే ఉంటారు. వారిద్దరి మధ్య అలాంటిదేమీ లేదని తెలిసినా కూడా జనాలు మాత్రం వారిని అంతే శ్రద్దతో చూస్తుంటారు. తెరపై వారు చేసే మ్యాజిక్‌కు అందరూ పడిపోతుంటారు. తాజాగా మరోసారి రొమాన్స్‌కు తెరలేపారు. ప్రస్తుతం ఈ జంట మరోసారి ట్రెండ్ అవుతోంది.

Sudheer-Rashmi : రష్మీ సుధీర్ రొమాన్స్ మామూలుగా లేదు!

తాజాగా వదిలిన ఢీ ప్రోమోలో ఓ రేంజ్‌లో రచ్చ చేశారు. మొదటగా దీపిక పిల్లి, రష్మి ఇద్దరూ కూడా వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి.. హైపర్ ఆది, సుధీర్‌లకు గులాబీ పువ్వులను ఇచ్చారు. ఆ తరువాత సుధీర్ రష్మీకి, ఆది దీపికపిల్లికి రోజా పువ్వు ఇచ్చారు. అందులోనూ సుధీర్ మరీ మోకాళ్ల మీద నిల్చుని ఇచ్చేశాడు. అనంతరం రష్మీ వచ్చి సుధీర్‌తో సాల్సా డ్యాన్స్ వేసింది. అందులో రష్మీ తెగ సిగ్గుపడిపోయింది. ఇప్పుడు సిగ్గు తొలకరి మొగ్గలేసినట్టు చేసేసింది.

Sudheer Rashmi in DHEE 13 Kings vs Queens

Sudheer Rashmi in DHEE 13 Kings vs Queens

అలా ఈ ఇద్దరి రొమాన్స్ ఎప్పుడూ కూడా ఫ్రెష్‌గా ఉంటూ.. ఏదో తెలియని మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తుంటుంది. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతకంటే ఏమీ లేదని ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చారో వారికే తెలియదు. కానీ తెర మీదకు వచ్చే సరికి మళ్లీ రెచ్చిపోతారు. తాము కేవలం ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు అలా చేస్తుంటామని, తెర వెనుక మంచి స్నేహితుల మాత్రమేనని చెప్పుకొస్తుంటారు. మొత్తానికి తాజా ప్రోమోలో మాత్రం సుధీర్ రష్మీ రొమాన్స్‌తో టాప్ లేపేశారు.

YouTube video

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది