Sudheer : సుధీర్ ముందు ప్రియుడితో తెగ స‌ర‌సాలు.. చూడలేక మ‌నోడు ఏం చేశాడంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudheer : సుధీర్ ముందు ప్రియుడితో తెగ స‌ర‌సాలు.. చూడలేక మ‌నోడు ఏం చేశాడంటే..!

Sudheer : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుధీర్ ఒక‌వైపు బుల్లితెర‌, మ‌రోవైపు వెండితెర‌పై తెగ సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. చాలా రోజుల త‌ర్వాత తిరిగి బుల్లితెర వైపు వ‌చ్చిన సుడిగాలి సుధీర్ ‘సర్కార్ సీజన్ 4’ అనే ఓటీటీ షో చేస్తున్నాడు. యాంకర్ ప్రదీప్ తర్వాత.. సుధీర్ వచ్చాక ఈ షోకి ఓటీటీలో డిమాండ్ మరింత పెరిగింది. కొత్త ఎపిసోడ్ రాగానే ఆహాలో ట్రెండింగ్ లోకి వచ్చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ షోకి […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 June 2024,3:30 pm

ప్రధానాంశాలు:

  •  Sudheer : సుధీర్ ముందు ప్రియుడితో తెగ స‌ర‌సాలు.. చూడలేక మ‌నోడు ఏం చేశాడంటే..!

Sudheer : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుధీర్ ఒక‌వైపు బుల్లితెర‌, మ‌రోవైపు వెండితెర‌పై తెగ సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. చాలా రోజుల త‌ర్వాత తిరిగి బుల్లితెర వైపు వ‌చ్చిన సుడిగాలి సుధీర్ ‘సర్కార్ సీజన్ 4’ అనే ఓటీటీ షో చేస్తున్నాడు. యాంకర్ ప్రదీప్ తర్వాత.. సుధీర్ వచ్చాక ఈ షోకి ఓటీటీలో డిమాండ్ మరింత పెరిగింది. కొత్త ఎపిసోడ్ రాగానే ఆహాలో ట్రెండింగ్ లోకి వచ్చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో బాగానే ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం లవ్ బర్డ్స్ సిరి హన్మంతు- శ్రీహాన్ అనే చెప్పాలి. ఈ జంట తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. వీరిద్ద‌రికి పెళ్లి కాలేదు కాని అంత‌కు మించి అన్న‌ట్టు ఉంటారు.

Sudheer ఏంటా.. ఆ అల్ల‌రి

ఈ ప్రేమ పక్షలు ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటారు. యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ తో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకోవడమే కాకుండా.. సెలబ్రిటీ హోదాను కూడా అందుకున్నారు. ఈ లవ్ బర్డ్స్ అప్పుడప్పుడు ప‌లు షోల‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తూ ఉంటారు. తాజాగా వారిద్ద‌రు సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న‌ సర్కార్ సీజన్ 4కి వచ్చి.. ఫ్యాన్స్ కి మంచి సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సిరి హన్మంతు- శ్రీహాన్ ఇద్దరూ వరుస పంచులు, కౌంటర్స్ తో సుడిగాలి సుధీర్ కి కూడా షాకుల మీద షాకులు ఇచ్చారు. అంతేకాకుండా.. శ్రీహాన్ చేసిన అల్లరి నెక్ట్స్ లెవల్ అంతే. సిరి తన ముందు ఉండగానే.. మరో అమ్మాయికి లవ్ లెటర్ రాయడమే కాకుండా.. చదివి వినిపించాడు కూడా. అంతేకాకుండా.. వీళ్లిద్దరు అప్పుడప్పుడు సరసాలు కూడా ఆడుకున్నారు.

Sudheer సుధీర్ ముందు ప్రియుడితో తెగ స‌ర‌సాలు చూడలేక మ‌నోడు ఏం చేశాడంటే

Sudheer : సుధీర్ ముందు ప్రియుడితో తెగ స‌ర‌సాలు.. చూడలేక మ‌నోడు ఏం చేశాడంటే..!

శ్రీహాన్ అయితే సిరి కోసం సుందరి అంటూ పాట కూడా పాడాడు. ఆ తర్వాత ఆమెకు నుదుటి మీద ఒక ముద్దు కూడా పెట్టాడు. ఇంక వీళ్లకి తోడు మరో వైరల్ జంట సోనియా సింగ్- పవన్ సిద్ధూ కూడా ఈ షోలో సందడి చేశారు. ఇంక వాళ్ల కామెడీ కూడా ప్ర‌త ఒక్కరిని తెగ న‌వ్విస్తుంది.. ఇంక సగం అర్థమయ్యి.. సగం అర్థం కాకుండా.. సోనియా సింగ్ చేసే అల్లరి ప్రేక్ష‌కుక‌లి మంచి వినోదం పంచింది. వీటన్నింటికి మించి సుడిగాలి సుధీర్ యాంకరింగ్ మెప్పిస్తుంది. ఇలా ఈ సర్కార్ సీజన్ 4 న్యూ ఎపిసోడ్ ప్రోమో తెగ సంద‌డి చేస్తుంటే, ఇక ఫుల్ ఎపిసోడ్ ప్రేక్ష‌కులకి పిచ్చెక్కిచండం ఖాయం అంటున్నారు.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది