Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కొత్త మూవీలో తమిళ హాట్ బ్యూటీ వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: May 14, 2023, 4:34 pm

Sudigali Sudheer : సుడిగాలి సుదీర్ తన తర్వాత చేయబోయే కొత్త సినిమా ప్రాజెక్టు లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. సుధీర్ కెరియర్ లో ఇది నాలుగవ సినిమా. ఈ సినిమాతో నరేష్ లీ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పక్కా మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కోసం కోలీవుడ్ ముద్దుగుమ్మ దివ్యభారతినీ హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ముద్దుగుమ్మ తమిళ సూపర్ హిట్ సినిమా “బ్యాచిలర్” తో విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. ఇప్పుడు తెలుగులో సుదీర్ సినిమాతో ఎంట్రీ ఇస్తూ ఉంది. సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Sudigali Sudheer is a Tamil beauty in a new movie

Sudigali Sudheer is a Tamil beauty in a new movie

జబర్దస్త్ నుండి మనోడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కామెడీ టైమింగ్ తో పాటు కష్టపడే గుణం ఉండటంతో… తనపై జోకులు వేసిన గాని.. అది కామెడీ పండించే విధంగా జనాలను ఎంటర్టైన్ చేసే రీతిలో సుధీర్ తీసుకునే విధానం ప్రేక్షకులను ఎంతగానో నచ్చుతుంది. దీంతో హీరోగా ఎదుగుతున్న సుధీర్ ఇటీవలపల్లి విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో నాలుగో సినిమాలో సుధీర్ సరసన హాట్ ముద్దుగుమ్మ దివ్యభారతినీ హీరోయిన్ గా ఫిక్స్ చేయడం సంచలనంగా మారింది. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Sudigali Sudheer is a Tamil beauty in a new movie

Sudigali Sudheer is a Tamil beauty in a new movie

ఈ హాట్ బ్యూటీ సినిమాలో ఉందంటే గ్లామర్ రచ్చ మామూలుగా ఉండదు … సుధీర్ అన్న కామెడీ ఈ హాట్ బ్యూటీ అందాల డోస్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్తాయని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా దివ్య భారతి ఎంట్రీ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తమిళంలో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దివ్యభారతి… ఈ ప్రాజెక్టులో అడుగు పెట్టడంతో సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సుడిగాలి సుదీర్ గత చిత్రం “గాలోడు” సూపర్ హిట్ అయింది. అదే తరహాలో ఈ నాలుగో సినిమా కూడా విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp