Sudigali Sudheer – Chammak Chandra : జబర్దస్త్‌.. ఇప్పటికి కూడా చమ్మర్ చంద్ర మరియు సుడిగాలి సుధీర్‌ లే టాప్‌..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 2 February 2023, 10:20 am

Sudigali Sudheer – Chammak Chandra : జబర్దస్త్ ఆరంభంలో చమ్మక్ చంద్ర వేసిన లేడీ గెటప్ తో షో కి మంచి పాపులారిటీ సొంతమైన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జబర్దస్త్ లో ఎంతో మంది లేడీ గెటప్స్ వేస్తూనే ఉన్నారు. కానీ కేవలం చమ్మక్ చంద్ర లేడీ గెటప్స్ కి సంబంధించిన స్కిట్స్ యూట్యూబ్ లో మంచి పాపులారిటీ ని సొంతం చేసుకున్నాయి. జబర్దస్త్ ఎపిసోడ్స్ మళ్లీ మళ్లీ ఈటీవీలో ప్రసారమవుతూనే ఉన్నాయి. ఎప్పుడు ప్రసారమైన కూడా జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర కామెడీ స్కిట్స్ ని ఎక్కువ మంది చూస్తున్నట్లు ఈటీవీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

sudigali sudheer and chammak chandra is the top comedians still now in jabardasth show

sudigali sudheer and chammak chandra is the top comedians still now in jabardasth show

ఈటీవీలో తిరిగి ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో చమ్మక్ చంద్ర స్కిట్స్ తో పాటు సుడిగాలి సుదీర్ యొక్క స్కిట్స్ కూడా ఎక్కువ రేటింగ్ సొంతం చేసుకుంటున్నాయట. అంతే కాకుండా యూట్యూబ్ లో అత్యధికంగా వ్యూస్ ని రాబడుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది, కనుక ఆ ఇద్దరు మళ్లీ జబర్దస్త్‌ కార్యక్రమంలో సందడి చేస్తే బాగుంటుందని అభిమానులు మరియు ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ ఇద్దరు లేక పోవడంతో జబర్దస్త్ కార్యక్రమం యొక్క రేటింగ్ చాలా తగ్గింది.

sudigali sudheer and chammak chandra is the top comedians still now in jabardasth show

sudigali sudheer and chammak chandra is the top comedians still now in jabardasth show

అందుకే మళ్ళీ వారిని తీసుకొస్తే ఖచ్చితంగా పూర్వ వైభవం జబర్దస్త్ కి దక్కడం ఖాయం అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మరియు బుల్లి తెర వర్గాల్లో కూడా జబర్దస్త్ గురించి ఈ మధ్య కాలంలో బ్యాడ్ ప్రచారం ఎక్కువైంది. ప్రతి ఒక్కరు కూడా జబర్దస్త్ పని అయిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా చమ్మక్ చంద్ర మరియు సుడిగాలి సుదీర్ యొక్క కామెడీ స్కిట్స్ చూస్తూ జబర్దస్త్ ని ప్రేక్షకులు బతికిస్తున్నారు. కనుక కొత్తగా వచ్చే వారు ఆ స్థాయిలో కామెడీ చేస్తే బాగుంటుంది లేదంటే వారినే మళ్లీ తీసుకొస్తే ఇంకా బాగుంటుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp