Jabardasth : ఆ ఐదుగురు వస్తే జబర్దస్త్ కి పూర్వ వైభవం ఖాయం.. పక్కా ఇండియాస్ నెం.1

Advertisement

Jabardasth : తెలుగు బుల్లితెర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే షో జబర్దస్త్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన జబర్దస్త్ ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక రేటింగ్ దక్కించుకున్న కార్యక్రమంగా నిలిచింది. అలాంటి జబర్దస్త్ కార్యక్రమం కి ఇప్పుడు అత్యంత దారుణమైన రేటింగ్ నమోదు అవుతుంది. ఒకప్పుడు యూట్యూబ్ లో కూడా వందల మిలియన్స్ వ్యూస్ జబర్దస్త్ స్కిట్స్ కి వచ్చేవి. అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు లక్షల్లో కూడా ప్రేక్షకులు జబర్దస్త్ ని చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. జబర్దస్త్ కి పూర్వ వైభవం రావాలని

If those five come again, the rating of Jabardasth show will increase
If those five come again, the rating of Jabardasth show will increase

ఎంతో మంది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది సాధ్యమా అంటే కచ్చితంగా సాధ్యం కాదు అంటూ చాలా మంది కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తున్నారు. ఒక్క విషయంలో మల్లెమాల వారు వెనక్కి తగ్గి వ్యవహరిస్తే కచ్చితంగా జబర్దస్త్ మళ్లీ మునుపటి సందడి చేయడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన ఐదుగురిని మల్లెమాల వారు మళ్లీ తీసుకుని వస్తే కచ్చితంగా షో యొక్క రేటింగ్‌ మళ్లీ పెరుగుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వారు ఎవరంటే జడ్జ్‌ నాగబాబు, సుడిగాలి సుదీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మరియు రోజా.

Advertisement
If those five come again, the rating of Jabardasth show will increase
If those five come again, the rating of Jabardasth show will increase

ఈ ఐదుగురిలో కచ్చితంగా మంచి ప్రతిభ ఉంది అనడంలో సందేహం లేదు. నాగబాబు షో ను అద్భుతంగా సాంగించడంలో ముందుంటారు. అంతే కాకుండా షో కి సంబంధించిన అన్ని విషయాలను ఆయన చూసుకునేవారు. ఇక కమెడియన్స్ ఆయన ఉంటే చాలా పద్ధతిగా క్రమశిక్షణతో ఉంటారని అభిప్రాయం కూడా ఉంది. అందుకే జబర్దస్త్ కార్యక్రమం మునుపటి రేటింగ్ సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు రావాల్సిందే అని ప్రేక్షకులు కూడా అభిప్రాయం చేస్తున్నారు. మరి మల్లెమాల వారు వారిని తీసుకొస్తారా అంటే కచ్చితంగా తీసుకురారని సమాధానం వినిపిస్తుంది. కనుక జబర్దస్త్ కి మునుపటి రేటింగ్ అనేది అసాధ్యం.

Advertisement
Advertisement