Hyper Aadi : సుడిగాలి సుధీర్‌ ప్రత్యక్షం.. ఇక హైపర్ ఆది కనిపించేది ఎప్పుడో?

 Authored By prabhas | The Telugu News | Updated on :30 June 2022,12:30 pm

Hyper Aadi : సుడిగాలి సుధీర్ ఇటీవల జబర్దస్త్‌ నుండి వెళ్లి పోవడంతో అభిమానులు మరియు ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్‌ ను వీడి సింగింగ్ షో లో యాంకర్‌ గా వ్యవహరించడం ఏంటీ అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడు సుదీర్‌ స్కిట్ లను చూస్తాం అంటూ ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఎట్టకేలకు కన్నుల విందు అన్నట్లుగా స్టార్‌ మా లో ప్రత్యక్ష్యం అయ్యాడు. పార్టీ చేద్దాం పుష్ప అంటూ స్టార్‌ మా లో ప్రసారం కాబోతున్న ఆదివారం ప్రత్యేక ఎపిసోడ్ లో సుధీర్ కనిపించబోతున్నాడు.

ఇప్పటి వరకు ఆదివారం ప్రత్యేక కార్యక్రమంగా టెలికాస్ట్‌ అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లో సుదీర్ యాంకర్ గా వ్యవహరించాడు. ఇప్పుడు అదే షో కు పోటీగా పార్టీ చేద్దాం పుష్ప షో కు యాంకర్ గా రాబోతున్నాడు. ఈ షో కు సంబంధించిన ప్రోమో విడుదల చేసి అంచనాలు పెంచారు. ఆదివారం మద్యాహ్నం సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీ 1 గంటకి ప్రారంభం అవుతుంది. అంతకు ముందే అంటే 12ః00 గంటలకు పార్టీ చేద్దాం పుష్ప షో తో స్టార్ మా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గాను సుడిగాలి సుధీర్ ఏర్పాట్లు చేసుకున్నాడు.

Sudigali Sudheer entry in to star maa show than where is Hyper Aadi

Sudigali Sudheer entry in to star maa show than where is Hyper Aadi

హీరోగా ఫుల్ బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఎన్ని ఉన్నా కూడా బుల్లి తెరను మాత్రం వీడటం లేదు. మల్లెమాల వారిని వీడిన సుధీర్ స్టార్‌ మా లో పార్టీ చేద్దాం పుష్ప షో తో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు హైపర్ ఆది కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగబాబు గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా ఆది కూడా వస్తాడు అనేది బుల్లి తెర వర్గాల వారి అభిప్రాయం. ఆది మరియు నాగబాబు మద్య ఎక్కువ సన్నిహిత సంబంధాలు లేవని.. అందుకే స్టార్‌ మా లోకి ఆదిని తీసుకు వచ్చేందుకు నాగబాబు ఆసక్తి చూపడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి