Sudigali Sudheer : ఆ అమ్మాయి తోనే నా పెళ్లి .. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : ఆ అమ్మాయి తోనే నా పెళ్లి .. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :31 August 2023,4:00 pm

Sudigali Sudheer : తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా కెరియర్ స్టార్ట్ చేసి అతి తక్కువ టైంలోనే స్టార్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో కమెడియన్ గా పనిచేసి ఆ షో లో యాంకర్ రష్మీ తో నడిపిన ప్రేమాయణం ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా సుధీర్ అంటే రష్మీ, రష్మీ అంటే సుధీర్ అన్నంతగా మారిపోయింది ఈ జంట. ముఖ్యంగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా షో కి హైలెట్ గా నిలిచేది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ, డి వంటి షోల కు హోస్ట్ గా వ్యవహరించిన సుధీర్

ఇతర చానల్స్ లో కూడా యాంకర్ అనసూయతో కలిసి హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు బుల్లితెర షోలకు దూరంగా ఉంటూ పూర్తి ఫోకస్ సినిమాల పైన పెట్టారు. గాలోడు సినిమాతో మంచి హిట్ను సొంతం చేసుకుని ఇప్పుడు మరొక చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ కి ఎప్పటి లాగే పెళ్లి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే సుదీర్ రష్మీలు వివాహం చేసుకుంటారని ప్రశ్నలు రాగా ఆయన ఖండిస్తూ తాము మంచి స్నేహితులం మాత్రమే అని వెల్లడించారు. ఇక తర్వాత యాంకర్ పెళ్లి చేసుకోపోయే అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారు అని అడగగా

Sudigali Sudheer marriage news

దీనికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చి అభిమానులను నిరాశ పరిచారు.సుధీర్ నాకు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదు పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా లేదంటూ అభిమానులను నిరాశ పరిచారు. ఒకవేళ చేసుకోవలసిన సమయం వస్తే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎప్పుడు చాలా కూల్ గా, సంతోషంగా ఒకరితో కలిసిపోతే చాలు అంతకుమించి మరే లక్షణాలు అవసరం లేదని జవాబు ఇచ్చారు. దీంతో పెళ్లి పేరు ఎత్తని సుధీర్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే సుధీర్ రష్మీ లు పెళ్లి చేసుకోరనీ అర్ధమైపోయింది.

https://youtu.be/MI-YeIEfpGs?si=OW6URgK463Lh-PEM

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది