Suhani Kalita : మనసంతా నువ్వే చిత్రంలో తూనీగ తూనీగ పాట ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట ఇప్పటికీ అందరి నోళ్లల్లో నానుతూనే ఉంది.ఇందులో నటించిన చిన్నారి పేరు. సుహాని కలిత.. 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో బాల నటిగా కనిపించినా.. 2008లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన సవాల్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాలనటిగా సుహాని మనసంతా నువ్వే, ఎలా చెప్పను, ప్రేమంటే ఇదేరా వంటి చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం సుహాని తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోను నటిస్తూ బిజీగా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమకి పరిచయమై తర్వాత ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నటించిన సుహాని ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతుంది. సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాను త్వరలో పెళ్లి చేసుకోండి. ఇటీవలే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి సన్నాహాలు కూడా జరుగుతున్నట్టు టాక్. బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన సుహాని..

Suhani Kalita : మనసంతా నువ్వే బ్యూటీ పెళ్లి..
గణేష్, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను.. లాంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా సినిమాలు చేసింది. సినిమాలతో పాటు పలు కంపెనీల యాడ్స్‌లోనూ నటించింది. 2008లో సవాల్ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాలు హీరోయిన్ గా చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది సుహాని.ఈ అమ్మడు సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంది.