Pushpa : నా సామీ కష్టం మరువలేను.. ‘పుష్ప’ సక్సెస్‌పై సుకుమార్ సతీమణి ఎమోషనల్ పోస్టు..!

Authored By mallesh | The Telugu News | Published on: December 23, 2021, 6:20 pm

Pushpa Success : పుష్ప ది రైజ్.. తగ్గేదెలే.. ప్రస్తుతం ఈ రెండు పదాలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. పుష్ప కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతుంది. ఇప్పటికే నేషనల్ వైడ్
ఈ సినిమా 200 వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కానీ దీనిపై మూవీ మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే, పుష్ప మూవీ ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడాన్ని దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత ఇన్ స్టా గ్రామ్ వేదికగా స్పందించారు. పుష్ప విజయం గురించి మాట్లాడే అవకాశం నాకు ఈ విధంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ప్రారంభించారు.

Pushpa Success : పుష్పరాజ్, నా సామీ కష్టాన్ని కళ్లారా చూశా..

పుష్ప సినిమా చూశాక మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్, నటీనటులు పడిన కష్టాన్ని గుర్తుచేసుకున్నానని చెప్పారు. ఇంతవరకు తానెప్పుడూ ఇలాంటి కష్టాన్ని చూడలేదన్నారు. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. సుకుమార్ చెప్పిన లైన్‌ను నమ్మి పుష్ఫ విజయంలో భాగమైనందుకు థ్యాంక్స్ చెప్పారు. ఇక అల్లు అర్జున్ గారు మీ పర్ఫామెన్స్ ‘అవుట్ ఆఫ్ ది వరల్డ్’.. నా ఊహకు మించి ఉందండి. మీ ఆటిట్యూడ్, మాస్ కారెక్టర్‌లో కూడా మీ స్టైల్ ఏమాత్రం తగ్గలేదన్నారు.

sukumar wife emotional post on pushpa success Meet

sukumar wife emotional post on pushpa success Meet

రష్మిక మందన్నా కూడా చిత్తూరు అమ్మాయి క్యారెక్టర్‌లో ఇమిడి పోయిందని రాసుకొచ్చారు. శ్రీవల్లి పాత్రకు రష్మిక న్యాయం చేశారని మెచ్చుకున్నారు. విలన్ పాత్రలో ఫాహద్ ఫాజిల్, నటుడు సునీల్, అజయ్ ఘోష్, డార్లింగ్ అనసూయ మీ అందరికి పాత్రలకు తగిన న్యాయం చేశారన్నారు. స్పెషల్ సాంగ్‌లో సమంత దమ్ములేపిందన్నారు. దేవీ శ్రీ ప్రసాద్ అన్నయ్య మరోసారి తన మ్యూజిక్‌తో అందరినీ ఆకట్టుకున్నాడని తబిత సుకుమార్ తెలిపింది. లిరిక్స్ అందించిన చంద్రబోస్ ను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఒస్తున్నా సామీ నీ దగ్గరకే అంటూ తన భర్త సుక్కును తబిత ఆకాశానికి ఎత్తేసింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp